Puri Musings : ‘‘లైఫ్‌లో ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేయాలి ?’’ పూరి జగన్నాథ్ సూపర్ టీచింగ్స్

మీకు లీగల్ ప్రాబ్లం వస్తే లాయర్‌ను అడగండి. హెల్త్ ప్రాబ్లం వస్తే డాక్ట‌ర్‌ను(Puri Musings) అడ‌గండి.

Published By: HashtagU Telugu Desk
Puri Musings Sharing Problems Director Puri Jagannath

Puri Musings  : ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ నిర్వహిస్తున్న ‘పూరి మ్యూజింగ్స్‌’ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఆయన ప్రతీసారి విభిన్న టాపిక్‌‌పై మాట్లాడుతూ తెలుగు నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఆయన ‘షేరింగ్‌ ప్రాబ్లమ్స్‌’ అనే అంశంపై  మాట్లాడుతూ కీలక సందేశాన్ని ఇచ్చారు. జీవితంలో సమస్యలు వస్తే ఏం చేయాలి ? ఎలా ఎదుర్కోవాలి ? అనే దానిపై ఈతరం వారికి ఆయన అమూల్యమైన సలహాలను ఇచ్చారు.

Also Read :New Ministers 2025 : ఆరుగురికి తెలంగాణ మంత్రులయ్యే భాగ్యం.. రేసులో ఎవరు ?

ప్రాబ్లమ్స్ వస్తే అందరికీ చెప్పాలా ?

పూరి జగన్నాథ్‌ కథనం ప్రకారం.. ‘‘మన సమస్యల్ని అందరికీ చెప్పుకోకూడదు. ఎందుకంటే అందరూ మన సమస్యల్ని అర్థం చేసుకోలేరు. మీ జీవితంపై ఆసక్తితో వాళ్లు ప్రశ్నలు అడిగి మరీ మీ సమస్యల గురించి తెలుసుకుంటారు. అలా తెలుసుకోవడం వల్ల వాళ్లకు ఒక రకమైన తృప్తి కలుగుతుంది.  మొత్తం అంతా విని మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు. మీరు ఏడుస్తూ బాధల గురించి చెప్పుకుంటే, వాటికి ఇంకొన్ని విషయాలను యాడ్ చేసుకుంటారు.  పైకి మీపై జాలి చూపిస్తారు. మీరు చెప్పడం అయిపోయిన తర్వాత మీ కథను ఊరంతా ప్రచారం చేస్తారు.  అందుకే మీ సమస్యల్ని మీరే పరిష్కరించుకోవాలి. మీ సమస్యల్ని మీరే పరిష్కరించుకుంటే  మానసికంగా బలపడతారు. మీ సమస్య గురించి మీకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. మన కష్టాలను మనలోనే దాచుకోవాలి. ప్రతి తుఫానును బయటికి ప్రసారం చేయాల్సిన అవసరం లేదు. కొన్ని మనలోనే దాచుకోవాలి. తుఫానును దాచుకునే శక్తి మీలో ఉంటే, జీవితంలో శక్తిమంతులు అవుతారు. మీకు లీగల్ ప్రాబ్లం వస్తే లాయర్‌ను అడగండి. హెల్త్ ప్రాబ్లం వస్తే డాక్ట‌ర్‌ను(Puri Musings) అడ‌గండి. మెంటల్ ప్రాబ్లం వస్తే థెరపిస్ట్‌ను అడగండి. డబ్బు కావాలంటే ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకోండి. అంతే త‌ప్ప మీ స‌మ‌స్య‌ల‌ను అంద‌రికీ చెప్పుకోవద్దు.’’

Also Read :Mosque Surveys : మసీదుల సర్వేకు ఆదేశాలివ్వొద్దు.. కోర్టులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

  Last Updated: 12 Dec 2024, 07:25 PM IST