పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veeramallu) ఈ నెల 24న థియేటర్లలో విడుదలై మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఓవర్సీస్‌లో ప్రీమియర్ షోలు 23న రాత్రే ప్రారంభమయ్యాయి. తొలి రోజు కలెక్షన్ల (Collections) పరంగా మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా, రెండో రోజు కొద్దిగా తగ్గిన వసూళ్లను నమోదు చేసింది. అయితే సినిమా విడుదలై మూడు రోజులు గడుస్తున్నా కలెక్షన్లపై నిర్మాణ సంస్థ అధికారికంగా ఎలాంటి పోస్టర్ విడుదల చేయకపోవడం ఆసక్తికర చర్చకు దారి తీసింది.
ఈ విషయంపై దర్శకుడు జ్యోతికృష్ణ స్పందిస్తూ.. “మేము నిజాయితీగా కలెక్షన్లు వెల్లడించినా, వాటిపై నెగటివ్ కామెంట్లు వస్తుంటాయి. కొన్ని వెబ్‌సైట్లు ఏవో రాస్తుంటాయి. అందుకే ‘విజయవంతంగా ప్రదర్శితమవుతోంది’ అనే పదాలతోనే సరిపెడుతున్నాం” అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎలాంటి కలెక్షన్ పోస్టర్ విడుదల చేయలేదని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో కలెక్షన్లపై స్పష్టత రానప్పటికీ, సోషల్ మీడియాలో ఈ వివరణపై చర్చ కొనసాగుతోంది.
IND vs ENG: ఐదవ టెస్ట్‌కు ముందు టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. గిల్‌కు గాయం?!
అయితే ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం సినిమా మూడవ రోజు దేశవ్యాప్తంగా రూ.9.87 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. ఇది రెండో రోజు వసూళ్లతో పోలిస్తే దాదాపు 23 శాతం పెరిగింది. మొదటి రోజు రూ.12.75 కోట్లు, రెండో రోజు రూ.8 కోట్లు వసూలవగా, మూడవ రోజు రూ.9 కోట్లకు పైగా వచ్చాయి. మొత్తం మూడు రోజుల్లో ‘హరిహర వీరమల్లు’ రూ.65.88 కోట్లు కలెక్షన్లు రాబట్టింది. ఆదివారం కూడా కలెక్షన్లు మెరుగ్గా ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా రెండు రోజుల్లో రూ.80 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, తెలుగు రాష్ట్రాల్లో రూ.60.50 కోట్లు వచ్చినట్లు సమాచారం. 3 రోజుల్లో రూ.91 కోట్ల వరకు కలెక్షన్లు సాధించే అవకాశముందని, నాలుగు రోజుల్లో 100 కోట్ల మార్కును అందుకోవచ్చని ట్రేడ్ అనలిస్ట్‌లు అంచనా వేస్తున్నారు. పవన్ కల్యాణ్ యోధుడి పాత్రలో ఆకట్టుకోగా, నిధి అగర్వాల్, బాబీ డియోల్, నోరా ఫతేహి, సత్యరాజ్ తదితరులు తమ పాత్రల్లో మెప్పించారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు.