Kiss : మీడియా ముందే హీరోయిన్ కు ముద్దు పెట్టిన డైరెక్టర్..

చిత్రసీమలో (Tollywood) ఎఫైర్స్ (Affair) అనేవి కామన్..షూటింగ్ లలో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమ , పెళ్లి , విడాకులు ఇలా ఎక్కడికో దారితీస్తుంటాయి. కొంతమంది మాత్రం పబ్లిక్ గా చెట్టాపట్టాలేసుకుంటూ తిరుగుతారు..కొంతమంది మాత్రం రహస్యంగా అన్ని కనిస్తుంటారు. ఏది చేసుకున్న మీడియా (Media) కంటపడకుండా చూసుకోవాలని ప్రతి ఒక్కరు భావిస్తారు. కానీ ఇక్కడ ఓ సీనియర్ డైరెక్టర్ మాత్రం చుట్టూ జనాలను ఉన్న..మీడియా ఎదురుగా ఉన్న ఏమాత్రం పట్టించుకోకుండా హీరోయిన్ బుగ్గ ఫై ముద్దు పెట్టి […]

Published By: HashtagU Telugu Desk
director kiss to mannara chopra

director kiss to mannara chopra

చిత్రసీమలో (Tollywood) ఎఫైర్స్ (Affair) అనేవి కామన్..షూటింగ్ లలో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమ , పెళ్లి , విడాకులు ఇలా ఎక్కడికో దారితీస్తుంటాయి. కొంతమంది మాత్రం పబ్లిక్ గా చెట్టాపట్టాలేసుకుంటూ తిరుగుతారు..కొంతమంది మాత్రం రహస్యంగా అన్ని కనిస్తుంటారు. ఏది చేసుకున్న మీడియా (Media) కంటపడకుండా చూసుకోవాలని ప్రతి ఒక్కరు భావిస్తారు. కానీ ఇక్కడ ఓ సీనియర్ డైరెక్టర్ మాత్రం చుట్టూ జనాలను ఉన్న..మీడియా ఎదురుగా ఉన్న ఏమాత్రం పట్టించుకోకుండా హీరోయిన్ బుగ్గ ఫై ముద్దు పెట్టి షాక్ ఇచ్చాడు. డైరెక్టర్ ఆలా చేస్తాడని పాపం సదరు హీరోయిన్ కు కూడా తెలియదు. క్షణాల్లో ఆలా జరిగిపోయింది. కానీ ఇప్పుడు ఈ ముద్దు వైరల్ గా మారింది.

మరి ఆ ముద్దు స్టోరీ ఏంటో చూద్దాం.

రాజ్ తరుణ్ (Raj Tarun) హీరోగా యజ్ఞం, పిల్లా నువ్వు లేని జీవితం లాంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు ఎ.ఎస్ రవికుమార్ చౌదరి (AS Ravi Kumar Chowdary) దర్శకత్వంలో సురక్ష ఎంటర్టైన్మెంట్ మీడియా పతాకంపై నిర్మాత మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘తిరగబడరా సామి’ (Tiragabadara Saami). మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా హీరోయిన్లు గా నటిస్తున్న ఈ మూవీ అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను సోమవారం విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ మన్నారా చోప్రా బుగ్గ ఫై డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ ముద్దు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. చిత్రబృందం ఫొటోకు ఫోజులు ఇస్తున్న సమయంలో, అందరూ చూస్తుండగానే హీరోయిన్​కు దర్శకుడు ముద్దు పెట్టాడు. దర్శకుడు చేసిన పనికి మన్నారా షాక్ అయ్యింది. చాలా ఇబ్బంది అనిపించినా, మనసులో దాచుకుని నవ్వుతూ కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన సినీ లవర్స్ , నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ వేస్తున్నారు. పబ్లిక్ గానే ముద్దు పెట్టాడంటే..పబ్లిక్ లేని సమయంలో ఇంకేమి చేసాడో అంటూ గుసగుసలు పెట్టుకుంటున్నారు.

Read Also : Vijayawada MP Seat : జగన్ మాస్టర్ ప్లాన్ వర్క్ అవుట్ అయ్యిందా..?

  Last Updated: 29 Aug 2023, 02:50 PM IST