Site icon HashtagU Telugu

AI Studio : ఏఐ స్టూడియోకు శ్రీకారం.. లాభాలేంటో చెప్పిన దిల్‌రాజు

Dil Raju Lorven Ai Studio Minister Sridhar Babu Telangana

AI Studio : ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు‌కు చెందిన ‘లార్వెన్‌ ఏఐ’ స్టూడియోను మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. స్టూడియో లోగోను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఆవిష్కరించారు. ఈసందర్భంగా దిల్‌ రాజు‌ మాట్లాడారు. ఏఐ స్టూడియోను ప్రారంభించాలన్న ఆలోచన రెండేళ్ల క్రితం తనకు వచ్చిందన్నారు.  అనంతరం క్వాంటమ్‌ ఏఐ కంపెనీని సంప్రదించి, సినిమా పరంగా ఏఐ ఎలా ఉపయోగపడుతుందో చర్చించానని పేర్కొన్నారు.

Also Read :Imran Khan : ఇమ్రాన్ ఖాన్‌తో జైలులో ప్రధాని, ఆర్మీ చీఫ్ భేటీ.. డీల్ ఫిక్స్ ?

ఏఐ ఇలా ఉపయోగపడుతుంది.. 

ప్రీ ప్రొడక్షన్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌, ప్రమోషన్స్‌ ఇలా  ప్రతీ విభాగంలోనూ సినిమా నిర్మాణంలో ఏఐ(AI Studio) భాగం కాబోతోందని దిల్ రాజు తెలిపారు. స్క్రిప్టు రెడీగా ఉంటే ఏఐ ద్వారా సౌండ్‌ ఎఫెక్ట్స్‌, విజువల్స్‌తో మనం సినిమా చూడొచ్చన్నారు. ఏఐ ద్వారా సినిమాల సక్సెస్‌ రేట్‌ పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దర్శకులు, రచయితలకు సమయం.. నిర్మాతలకు డబ్బు ఆదా అవుతుందన్నారు. ఆ డబ్బుతో మరిన్ని సినిమాలను తీసే అవకాశం ఉంటుందన్నారు. ఎమోషన్స్‌లేని అసిస్టెంట్‌ డైరెక్టర్‌‌లా ఏఐ స్టూడియో ఉపయోగపడుతుందని దిల్ రాజు కామెంట్ చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు రాఘవేంద్రరావు, అనిల్‌ రావిపూడి, వి.వి. వినాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Also Read :Congress : హాట్ కేకుల్లా డీసీసీ అధ్యక్ష పోస్టులు.. కాంగ్రెస్‌లో ‘సంస్థాగత’ సందడి

ప్రత్యేక వీడియోలో కీలక సమాచారం

తన ఏఐ స్టూడియో గురించి తెలుపుతూ ఏప్రిల్ 16వ తేదీన దిల్ రాజు ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. దాని ఏర్పాటు వెనుక ఉన్న విజన్‌ను ఆ వీడియోలో వివరించారు.  1913లో తొలి సినిమాతో భారతదేశం వెండితెరపై ప్రేమలో పడిందని గుర్తు చేశారు. ఇప్పుడు 2025లో ఆ ప్రేమను ఏఐ టెక్నాలజీతో కలిపి మరో విప్లవానికి నాంది పలుకుతున్నామని వెల్లడించారు. 1931లో తొలి టాకీ చిత్రం నుంచి 1995లో వీఎఫ్ఎక్స్ సినిమాల వరకు ఇండియన్ సినిమా చేసిన ప్రయాణాన్ని చూపిస్తూ.. AI స్టూడియో దీని తర్వాతి దశ అని దిల్ రాజు వెల్లడించారు.