టాలీవుడ్(Tollywood)లో ప్రఖ్యాత నిర్మాతగా పేరుగాంచిన దిల్ రాజు (Dilraju) ఇప్పుడు మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుడుతున్నారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ, సినిమా ఇండస్ట్రీకి మరింత మౌలిక వనరులు అందించాలనే లక్ష్యంతో ఏఐ పవర్డ్ మీడియా కంపెనీ(AI Powered Media Company)ని ప్రారంభించనున్నారు. ఇది పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా పనిచేసే సంస్థగా ఉంటుందని తెలుస్తోంది.
Sravan Rao : నాలుగోసారి సిట్ విచారణకు హాజరైన శ్రవణ్‌రావు
ఈ కొత్త సంస్థ కోసం దిల్ రాజు క్వాంటమ్ ఏఐ గ్లోబల్ అనే ఇంటర్నేషనల్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. ఎంటర్టైన్‌మెంట్ ఇండస్ట్రీలో ఉన్న అవసరాలు, సవాళ్లకు సమాధానంగా ఉండేలా అత్యాధునిక ఏఐ టూల్స్ ఉపయోగించి వినూత్న సదుపాయాలు తీసుకురాబోతున్నారు. స్క్రిప్ట్ రచన, వీడియో ఎడిటింగ్, ప్రమోషన్ మెటీరియల్స్ తయారీ వంటి అనేక రంగాల్లో ఈ టెక్నాలజీతో సహకరించనున్నారని సమాచారం.
ఈ కంపెనీకి సంబంధించి పూర్తి వివరాలు, పేరును మే 4వ తేదీన అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా జరగనున్న ఈవెంట్‌కి ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు హాజరవుతారని చెబుతున్నారు. తెలుగు చిత్రరంగంలో టెక్నాలజీ ఆధారిత మార్పులకు దిల్ రాజు శ్రీకారం చుడుతున్న ఈ కొత్త అడుగు, భవిష్యత్తులో సినిమాలు నిర్మాణం, ప్రమోషన్ విధానాల్లో పెనుమార్పులకు దారితీయనుంది.