టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో థియేటర్ల బంద్ (Theaters Bandh), విడుదల సమస్యలపై చర్చలు హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నటించిన ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమా విడుదల సమయంలో థియేటర్లను బంద్ చేయాలన్న నిర్ణయం కలకలం రేపింది. ఈ నిర్ణయం వెనుక ‘ఆ నలుగురు’ ఉన్నారని ప్రభుత్వ వర్గాలు ఆరోపించడంతో మంత్రి కందుల దుర్గేష్ విచారణకు ఆదేశించారు. అంతేగాక తెలుగు సినీ పరిశ్రమ రాష్ట్రానికి కృతజ్ఞతలు తెలియజేయడం లేదంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో నిర్మాత అల్లు అరవింద్, దిల్ రాజు ఇలా ఒక్కొక్కరుగా మీడియా సమావేశాలు నిర్వహిస్తూ వివరణలు ఇస్తున్నారు.
Corona : దేశంలో పెరుగుతున్న కరోనా మరణాలు..ప్రజల్లో మొదలైన భయం
తాజాగా దిల్ రాజు (Dil Raju) మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వం సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న కందుల దుర్గేష్ వివాదం పరిష్కారానికి చేసిన ప్రకటనపై హర్షం వ్యక్తం చేశారు. గత తొమ్మిది రోజులుగా కొనసాగుతున్న సమస్యలు ఇప్పుడు సద్దుమణిగినట్టు చెప్పారు. ఇండస్ట్రీ తరపున నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేశారు. సినిమాల విడుదలలో పర్సెంటేజ్ విధానం వల్ల ఎగ్జిబిటర్లకు ఇబ్బందులు వచ్చాయని వివరించారు. ముఖ్యంగా నైజాంలో ఉన్న థియేటర్లలో తామెవరు ఎంత వాటా కలిగి ఉన్నారో స్పష్టంగా చెప్పారు. మీడియా ‘ఆ నలుగురు’ అంటూ వ్యక్తిగత దాడులు చేయడం సరికాదని, తాము స్పష్టత ఇస్తున్నామని అన్నారు.
Bride calls off wedding in Karnataka: తాళి కట్టేముందే వరుడికి ఊహించని షాక్… వైరల్ అవుతోన్న వీడియో
ఇక అల్లు అరవింద్ కూడా తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. ‘ఆ నలుగురు’లో తాను లేనని, తనకు కేవలం 15 థియేటర్లలోపే వాటా ఉందని తెలిపారు. ఈ వివాదం పూర్తిగా తప్పుడు దారిలో మలిచారని, మీడియా కావాలనే అసత్య ప్రచారాలు చేస్తోందని ఆరోపించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమా, థియేటర్ల వివాదం నేపథ్యంలో ఈ ఇద్దరు ప్రముఖ నిర్మాతల స్పందనలు టాలీవుడ్‌లో పలు అసలు లెక్కలు వెలుగులోకి తీసుకువస్తున్నాయి.