Site icon HashtagU Telugu

Game Changer Pre Release : రాజమండ్రి లేదా విజయవాడ లో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్

Dilraju Pawan

Dilraju Pawan

గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ (Game Changer Pre Release) వేడుకను రాజమండ్రి లేదా విజయవాడ జరిపేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు ఈరోజు నిర్మాత దిల్ రాజు(Dil Raju), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో భేటీ అయ్యారు. శంకర్ – రామ్ చరణ్ కలయికలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10 న భారీ ఎత్తున విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టి సినిమా పై అంచనాలు పెంచుతున్నారు మేకర్స్. నిన్న ఆదివారం విజయవాడలో చరణ్ అభిమానులు ఏర్పాటు చేసిన 256 అడుగుల ఎత్తయిన రామ్ చరణ్ కటౌట్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దిల్ రాజు హాజరై సందడి చేసారు.

ఇక ‘గేమ్ ఛేంజర్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు రావాలని ఏపీ డిప్యూటీ సీఎం , పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ను ఆహ్వానించారు. మంగళగిరి జనసేన కార్యాలయంలో ప‌వ‌న్ తో దిల్ రాజు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని పవన్‌కు వివరించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా ప‌వ‌న్ రావాల‌ని దిల్ రాజు కోర‌డంతో జ‌న‌సేనాని ఒకే చెప్పిన‌ట్లు తెలుస్తుంది. అలాగే ఈ ప్రీ రిలీజ్ వేడుకను జ‌న‌వ‌రి 04న‌ రాజ‌మండ్రి లేదా విజయవాడ లో ప్లాన్ చేస్తున్నారు. పవన్ వేదిక ఖరారు చేస్తే వెంటనే ఆ ఏర్పాట్లు స్టార్ట్ చేయనున్నారు. అలాగే పవన్ తో భేటీ లో సినిమా టికెట్ రేట్ల అంశంతో పాటు సినీ పరిశ్రమకు సంబంధించిన వివిధ అంశాలపైనా దిల్ రాజు చర్చించారు.

Read Also : Kumbh Mela : మహా కుంభమేళాకు ఏపీ నుంచి ప్రత్యేక రైళ్లు