Site icon HashtagU Telugu

Dil Raju : కేసీఆర్ ను కలిసిన దిల్ రాజు..ఎన్నికల వేళ ఇదేంటి..?

Dil Raju Meets Kicar

Dil Raju Meets Kicar

ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju)..మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ను నంది నగర్ నివాసం లో మర్యాదపూర్వకంగా కలిసి కేసీఆర్ ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా తన తమ్ముడు శిరీష్ రెడ్డి తనయుడు ఆశిష్ రెడ్డి (Ashish Reddy) వివాహ ఆహ్వాన పత్రికను కేసీఆర్ కు అందించారు.

అలాగే ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ మంత్రులు జి జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, చిరుమర్తి లింగయ్య రవీంద్ర నాయక్, ఎంఎల్సీ వెంకట్రాం రెడ్డి, పిర్జాదిగూడ మేయర్ జక్కావెంకట్ రెడ్డి, తదితర పార్టీ నేతలు కేసీఆర్ ను కలిశారు.

We’re now on WhatsApp. Click to Join.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనంతరం కేసీఆర్ ఫామ్ హౌస్ లో కిందపడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆయన తుంటి ఎముక విరగడంతో యశోద ఆసుపత్రిలో చికిత్స కూడా చేయడం జరిగింది. హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ చేసిన వైద్యులు ఎనిమిది వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో మొన్నటి వరకు ఇంటిలోనే విశ్రాంతి తీసుకున్న కేసీఆర్..ఇప్పుడెప్పుడు కర్ర సాయంతో నడుస్తున్నారు. రెండు రోజుల క్రితం అసెంబ్లీ లోని స్పీకర్ ఛాంబర్ లో గజ్వేల్ ఎమ్మెల్యే గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. తెలంగాణలో మరో రెండు నెలలలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి ఇటీవల పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశం కూడా నిర్వహించటం జరిగింది.

ఆశిష్ రెడ్డి విషయానికి వస్తే..’రౌడీ బాయ్స్’తో ఆశిష్ రెడ్డి హీరోగా పరిచయం అయ్యారు. ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. ఈ క్రమంలో ఇక ఇప్పుడు పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడు కావాలని ఫిక్స్ అయ్యాడు. ఏపీకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె అద్వైత రెడ్డి ని ఆశిష్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ నెల 14న జైపూర్ సిటీలో డెస్టినేషన్ వెడ్డింగ్ అయితే… 20వ తేదీన తెలుగు సినీ, రాజకీయ ప్రముఖుల కోసం హైదరాబాద్ సిటీలో రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు. కొంత మంది సినిమా ప్రముఖులను జైపూర్ లో పెళ్లికి హాజరు కావాల్సిందిగా ‘దిల్’ రాజు ఫ్యామిలీ స్పెషల్ ఇన్విటేషన్స్ ఇచ్చింది.

Read Also : Kumari Aunty : కుమారి ఆంటీ హోటల్ వద్ద నిరుద్యోగుల నిరసన…