Site icon HashtagU Telugu

Dil Raju: రెండో పెళ్లిపై వచ్చిన ట్రోల్స్ పై స్పందించిన దిల్ రాజు.. అవి చూసి నా భార్య అలా?

Dil Raju

Dil Raju

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు మొదటి భార్య అనిత అనారోగ్య సమస్యల కారణంగా మరణించడంతో ఆ తర్వాత 50 ఏళ్ల వయసులో మరొకసారి రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ రెండో పెళ్లి ప్రేమ వివాహం కావడం విశేషం. అంతేకాదు గత ఏడాది రెండో భార్య తేజస్వినితో ఒక బాబుకి కూడా జన్మనించారు. కాగా ఈ ప్రేమ పెళ్లి చేసుకోవడం పట్ల దిల్ రాజు పై ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. అంతేకాకుండా మ్యారేజ్ సమయంలో కూడా ఎన్నో రకాల ట్రోల్స్ చేశారు. నెగిటివ్ కామెంట్స్ చేస్తూ బూతులు మాట్లాడుతూ రెచ్చిపోయారు.

We’re now on WhatsApp. Click to Join
గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దిల్ రాజు తన ప్రేమ వ్యవహారం గురించి చెప్పుకొచ్చారు. ఆ తర్వాత దిల్ రాజు పై ట్రోలింగ్స్ మరింత ఎక్కువ అయ్యాయి. ఇక ట్రోల్స్ తన భార్య చూసి తనకి చూపించి బాధ పడ్డారట.

 

అయితే దిల్ రాజు మాత్రం వాటిని చాలా స్పోర్టివ్ గా తీసుకోని పాజిటివ్ థింకింగ్ తో భార్య తేజస్వినికి సమాధానం ఇచ్చారట. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది తెలుగు వారిలో తాను ఒక కోటి మంది ప్రజలకు ప్రొడ్యూసర్ గా తెలిసి ఉంటారు. వారిలో ఆ ట్రోల్స్ చేసిన వారు లేదా కామెంట్స్ చేసినవారు మహా అయితే ఒక పది వేల మంది ఉంటారు.

Also Read: Vijay : రజనీకాంత్ ను మించి రెమ్యూనరేషన్ అందుకుంటున్న విజయ్.. ఒక్కో మూవీ అన్ని కోట్లు?

మిగిలిన వారంతా తన ప్రేమని కామెంట్ చేయకుండా గౌరవిస్తున్న వారే కదా. కాబట్టి వీరందరూ ఇచ్చే గౌరవాన్ని పట్టించుకోకుండా, కేవలం ఆ పది వేల మంది కామెంట్స్ కి బాధపడడం అమాయకత్వం అని దిల్ రాజు జవాబు ఇచ్చారట. ఇకపోతే దిల్ రాజు కెరియర్ విషయానికి వస్తే దిల్ రాజు నిర్మించిన ఫ్యామిలీ స్టార్ మూవీ నేడు థియేటర్లోకి రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా దిల్ రాజు ట్రోల్స్ పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

Also Read: Paiyaa Movie: 12 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ కాబోతున్న తమన్నా సూపర్ హిట్ మూవీ.. అదేంటంటే?

Exit mobile version