Chaitanya Master : బ్రేకింగ్.. ఢీ డ్యాన్స్ మాస్టర్ చైతన్య సూసైడ్..

శనివారం ప్రపంచ నృత్య దినోత్సవ సందర్భంగా నెల్లూరు టౌన్ హాల్ లో జరిగిన కళాంజలి ప్రపంచ నృత్య దినోత్సవ సన్మాన కార్యక్రమానికి చైతన్య హాజరయ్యాడు.

Published By: HashtagU Telugu Desk
Dhee Fame Chaitanya Master passes away

Dhee Fame Chaitanya Master passes away

తెలుగు సినీ, టీవీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ఓ గ్రూప్ డ్యాన్సర్(Dancer) గా కెరీర్ మొదలుపెట్టి డ్యాన్స్ మాస్టర్(Dance Master) గా ఎదిగాడు చైతన్య మాస్టర్(Chaitanya Master). పలు టీవీ షోలలో తన డ్యాన్స్ తో మెప్పించాడు. ఢీ(Dhee) షోలో డ్యాన్స్ మాస్టర్ గా మంచి ప్రదర్శనలు ఇప్పించాడు. తాను కూడా డ్యాన్స్ చేసి ప్రేక్షకులని ఎంటర్టైన్ చేశాడు. తాజాగా చైతన్య మాస్టర్ ఆత్మహత్య చేసుకొని మరణించి అందర్నీ షాక్ కి గురి చేశాడు.

శనివారం ప్రపంచ నృత్య దినోత్సవ సందర్భంగా నెల్లూరు టౌన్ హాల్ లో జరిగిన కళాంజలి ప్రపంచ నృత్య దినోత్సవ సన్మాన కార్యక్రమానికి చైతన్య హాజరయ్యాడు. అనంతరం నేడు సాయంత్రం నెల్లూరు క్లబ్ లో డాన్స్ మాస్టర్ చైతన్య ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయేముందు ఓ సెల్ఫీ వీడియో తీసి తన దగ్గరివారికి పంపించాడు. ఈ వీడియోలో తనకు ఇష్టమైన వారిని క్షమించమని అడిగి, అప్పులు బాధలు ఎక్కువయ్యాయని, డ్యాన్సర్ గా పేరు వచ్చినా డబ్బులు రావట్లేదని, అప్పుల బాధలు తీర్చలేకే ఈ పనిచేస్తున్నాను అని తెలిపాడు.

చైతన్య మాస్టర్ ఆత్మహత్య నెల్లూరులో కలకలం సృష్టించింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. చైతన్య మాస్టర్ చనిపోవడంతో ఢీ టీం, డ్యాన్సర్లు విషాదంలో మునిగిపోయారు.

 

Also Read :   Udaya Bhanu: ఉదయభాను కొత్తింటి వీడియోని చూశారా.. ఎంత అందంగా ఉందో?

  Last Updated: 30 Apr 2023, 08:24 PM IST