Dhanush Nagarjuna Multistarrer Title కోలీవుడ్ స్టార్ ధనుష్ ఈమధ్యనే కెప్టెన్ మిల్లర్ అంటూ వచ్చి సందడి చేశాడు. కెప్టెన్ మిల్లర్ తమిళంలో సంక్రాంతి రేసులో రిలీజ్ అవ్వగా వారం తర్వాత తెలుగులో రిలీజైంది. కెప్టెన్ మిల్లర్ తర్వాత ధనుష్ తెలుగులో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నాగార్జున కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ధనుష్, నాగార్జున ఈ ఇద్దరు కలిసి స్క్రీన్ మీద సందడి చేయనున్నారు.
We’re now on WhatsApp : Click to Join
ఈ సినిమా కథ మొత్తం ముంబై మురికివాడలో నడుస్తుందట. అందుకే ఈ సినిమాకు టైటిల్ గా ధారావి అని పెట్టనున్నారట. ధారావి ముంబైలో ఒక ప్రముఖ మురికివాడ. ఆ బ్యాక్ డ్రాప్ తో మాఫిర్యా ని లింక్ పెట్టి ఈ సినిమా కథ రాసుకున్నాడట శేఖర్ కమ్ముల. ఈ సినిమాలో నాగార్జున డాన్ గా నటిస్తున్నాడని తెలుస్తుంది. ధారావి అనే పవర్ ఫుల్ టైటిల్ తో డి.ఎన్.ఎస్ మూవీ రాబోతుంది.
ఈ సినిమాను ఏసియన్ సునీల్ నారంగ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ఉంటుంది. ధనుష్, నాగార్జున ఈ ఇద్దరు కలిసి ఒకే సినిమాలో కనిపించడం సినీ లవర్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది.
ఇన్నాళ్లు శేఖర్ కమ్ముల సెన్సిబుల్ సినిమాలతో వచ్చాడు. కెరీర్ లో ఫస్ట్ టైం ఒక యాక్షన్ మూవీతో వస్తున్నాడు. మరి శేఖర్ కమ్ముల ఈ భారీ ప్రాజెక్ట్ ని ఎలా హ్యాండిల్ చేస్తాడన్నది చూడాలి.
Also Read : Puri Jagannadh Divorce : ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారిన డైరెక్టర్ పూరి విడాకుల వార్త..