Site icon HashtagU Telugu

Devi Sri Prasad : పాపం దేవిశ్రీ ప్రసాద్.. ఫస్ట్ కాన్సర్ట్ తోనే విమర్శలు..

Devi Sri Prasad Music Concert Failed due to some Issues Fans and Music Lovers Trolling Him

Dsp

Devi Sri Prasad : ఇటీవల పలువురు మ్యూజిక్ డైరెక్టర్స్ మ్యూజిక్ కాన్సర్ట్స్ అని ఈవెంట్స్ పెట్టి బాగానే సంపాదించుకుంటున్నారు. లైవ్ లో పాటలు పాడితే మ్యూజిక్ అంటే ఇష్టం ఉన్నవాళ్లు, ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఫ్యాన్స్, హీరోల ఫ్యాన్స్ వచ్చి సందడి చేస్తారు. మ్యూజిక్ డైరెక్టర్ పాటలు పాడుతుంటే వచ్చిన జనాలు కూడా శృతి కలిపి పాడేస్తుంటారు. హాలీవుడ్ లో ఇలాంటి మ్యూజిక్ కాన్సర్ట్స్ బాగా ఫేమస్. ఇప్పుడిప్పుడే ఇండియాలోకి వస్తున్నాయి. ఇటీవల తమిళ్ లో రహమాన్, అనిరుద్ మ్యూజిక్ కాన్సర్ట్స్ పెట్టగా అనిరుధ్ ఈవెంట్ బాగా సక్సెస్ అవ్వగా రహమాన్ ఈవెంట్ విమర్శలపాలైంది.

తాజాగా దేవిశ్రీ ప్రసాద్ నిన్న గచ్చిబౌలి స్టేడియంలో మ్యూజిక్ కాన్సర్ట్ పెట్టాడు. దేవిశ్రీ ప్రసాద్ తన మ్యూజిక్ కాన్సర్ట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేసి సీఎం రేవంత్ రెడ్డి నుంచి చిరంజీవి వరకు చాలా మంది స్టార్స్ లని ఆహ్వానించాడు. ఇక ఒక్కో టికెట్ వెయ్యి రూపాయల పైనే పెట్టారు. జనాలు కూడా మొదటిసారి హైదరాబాద్ లో, అది కూడా మన తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ కాన్సర్ట్ పెట్టడంతో చాలా మంది వచ్చారు.

అయితే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కాన్సర్ట్ ఫెయిల్ అయింది అంటున్నారు నెటిజన్లు, అక్కడికి వెళ్లిన జనాలు. అక్కడ కాన్సర్ట్ లో కనీస వసతులు లేవని, ఆ కాన్సర్ట్ వల్ల గచ్చిబౌలి అంతా ట్రాఫిక్ జామ్ అయిందని, కనీసం సౌండ్ సిస్టం కూడా సరిగ్గా లేదని, దేవిశ్రీ కొన్ని పాటలు మధ్యలో మర్చిపోయాడని.. ఇలా పలు విమర్శలతో సోషల్ మీడియాలో దేవిశ్రీని ట్రోల్ చేస్తున్నారు. ఇక మహేష్ ఫ్యాన్స్ ది మరో బాధ. దేవిశ్రీ – మహేష్ కాంబోలో చాలా సినిమాలు ఉన్నాయి అయినా కాన్సర్ట్ లో ఒక్క మహేష్ సాంగ్ కూడా పాడలేదని, ఎక్కువగా మెగా ఫ్యామిలీ సాంగ్స్ పాడాడని ట్రోల్ చేస్తున్నారు.

మొత్తానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కాన్సర్ట్ ఏదో గ్రాండ్ గా చేద్దాం అనుకుంటే ఇలా ట్రోలింగ్ బారిన పడ్డాడు. ఇంకొంతమంది అయితే అనిరుధ్ లాగా ఎవ్వరూ చేయలేరని పొగుడుతూ దేవిశ్రీని విమర్శిస్తున్నారు. మరి ఈ విమర్శలపై దేవిశ్రీ ఏమైనా సమాధానం ఇస్తాడా? ఇంత జరిగాక వేరే తెలుగు మ్యూజిక్ డైరెక్టర్స్ భవిష్యత్తులో మ్యూజిక్ కాన్సర్ట్స్ పెడతారా చూడాలి.

 

Also Read : Mechanic Rocky : విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ ట్రైలర్ వచ్చేసింది.. మాస్ మెకానిక్..