Devara Trailer Records : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దేవర ట్రైలర్ (Devara Trailer) రావడమే కాదు యూట్యూబ్ లో రికార్డ్స్ వ్యూస్ రాబడుతూ సరికొత్త రికార్డ్స్ నెలకొల్పుతుంది. ఎన్టీఆర్ (NTR), RRR తర్వాత గ్యాప్ తీసుకొని దేవర సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. మాస్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ఈ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. సినిమా విడుదలకు కొద్దీ రోజుల సమయమే మాత్రమే ఉండటంతో మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడును పెంచారు.
ఇప్పటికే మూడు పాటలను విడుదల చేసి సినిమా ఫై అంచనాలు పెంచేసిన మేకర్స్.. నిన్న మంగళవారం ముంబై లో సినిమా ట్రైలర్‌ను గ్రాండ్‌గా విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. విడుదలై కొద్ది నిమిషాల్లోనే ఫ్యాన్స్ లైకులు షేర్స్ తో నెట్టింట ట్రెండ్ చేసారు. ఈ ట్రైలర్ రిలీజైన 24 గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి 55 మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతోపాటు యూట్యూబ్లో ట్రైలర్ ట్రెండ్ అవుతోందని తెలిపారు. కాగా, ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని, ఓ ట్రైలర్ కు ఇన్ని వ్యూస్ రావడం ఇదే తొలిసారని సినీవర్గాలు చెబుతున్నాయి. ఈ ట్రైలర్ లో కులం లేదు, మతం లేదు, భయం లేదు అంటూ ప్రకాష్ రాజ్ వాయిస్ తో దేవరను పరిచయం చేస్తారు. ఆ తర్వాత మనిషికి బ్రతికేంత దైర్యం చాలు, చంపెంత ధైర్యం కాదు అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సైఫ్ అలీఖాన్ డైలాగులు కూడా ఆకట్టుకున్నాయి. యాక్షన్స్ సీన్స్ అయితే అదిరిపోయాయి.
ట్రైలర్ రిలీజ్ సందర్భంగా కాస్త నర్వస్ గా ఉంది – ఎన్టీఆర్
ఇక ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఎన్టీఆర్ మాట్లాడుతూ..దాదాపు ఆరేళ్ల తర్వాత తన నుంచి వస్తున్న సోలో రిలీజ్ ‘దేవర’ అని చెప్పుకొచ్చారు. మల్టీస్టారర్ RRR తర్వాత రానున్న చిత్రమన్నారు. ట్రైలర్ రిలీజ్ సందర్భంగా కాస్త నర్వస్ గా ఉందని, ముంబైలో ఈ ఈవెంట్ జరగడం సంతోషంగా ఉందన్నారు. RRRకు ప్రమోషన్ సమయంలో నార్త్ నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని , ‘దేవర’ విషయంలోనూ ఇదే జరుగుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
దేవర లాస్ట్ 40 మినిషాలు వేరే లెవెల్..
ఇక సినిమా ఆఖరి 40 నిమిషాలు ‘దేవర’ (Devara Movie Climax) ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తుందని ఎన్టీఆర్ తెలిపి అభిమానుల్లో ఆసక్తి మరింత పెంచారు. ‘సినిమాలో ఫలానా చోటే యాక్షన్ బాగుంటుందని నేను చెప్పలేను. సినిమా అంతా అద్భుతంగా వచ్చింది. ఆ విజువల్స్ మీరు ఎప్పుడెప్పుడు చూస్తారా అని ఎదురుచూస్తున్నా. ట్రైలర్ ఆఖర్లో సొరచేపతో ఉన్న షాట్ను ఒక రోజంతా షూట్ చేశాం’ అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ మాటలతో సినిమా ఫై మరింత అంచనాలు పెరగడం ఖాయం. ఇక ట్రైలర్ చూసిన సినీ లవర్స్ మాత్రం BGM ఇంకాస్త బాగుంటే అదిరిపోయేదంటున్నారు. ట్రైలర్లో కావాల్సినన్ని ఎలివేషన్స్ ఉన్నాయని, NTRకు మాస్ బొమ్మ పడబోతోందని అభిప్రాయపడుతున్నారు. ట్రైలర్లో లాస్ట్ సీన్ అదుర్స్ అని కామెంట్స్ చేస్తున్నారు.
Read Also : Central Team Visits Telangana: వరద నష్టంపై కేంద్ర బృందానికి వివరించిన సీఎస్