టాలీవుడ్ (Tollywood) తో పాటు పాన్ ఇండియా వైడ్ గా మూవీ లవర్స్ ఎదురుచూస్తున్న “దేవర” (Devara) మరికాసేపట్లో థియేటర్స్ లలో సందడి చేయబోతుంది. ఇప్పటికే ఇతర దేశాల్లో ప్రీమియర్ షోస్ పూర్తి అయ్యాయి. సినిమా చూసిన ప్రతి ఒక్కరు బ్లాక్ బస్టర్ హిట్ అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ పెడుతున్నారు.
ఎన్టీఆర్ – కొరటాల శివ (Koratala siva) కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “దేవర”. దేవర నుండి రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ , ట్రైలర్ ఇలా ప్రతీది కూడా సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇక దేవర ట్రైలర్ రిలీజ్ అయిన రోజు నుంచే, సినిమాపై మరింత అంచనాలను మరింత పెంచుతూ మేకర్స్ ప్రమోషన్ చేసారు.
ఇంతే కాకుండా ఎన్టీఆర్ నుండి దాదాపు ఆరేళ్ల గ్యాప్ తర్వాత సోలో గా వస్తున్న మూవీ కావడం తో వరల్డ్ వైడ్ గా ఆసక్తి నెలకొంది. దీంతో ఫస్ట్ డే సినిమా చూడాలని అభిమానులు తహతలాడుతున్నారు. ఈ అంచనాలకు తగ్గట్లే రెండు తెలుగు రాష్ట్రాల్లో అర్ధరాత్రి నుండి షోస్ మొదలుకాబోతున్నాయి. రోజుకు సింగిల్ స్క్రీన్ లలో 6 షోస్ కు అనుమతి రావడం తో టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. మూడు రోజుల పాటు ఎక్కడ కూడా టికెట్ దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో టికెట్ దొరకని వారు బ్లాక్ లో టికెట్ కోసం ట్రై చేస్తున్నారు. ఇక అర్ధరాత్రి మొదలై షో కు రూ. 2 వేలు టికెట్ ధర పలుకుతున్నట్లు సమాచారం. అయినాగానీ అభిమానులు తగ్గేదెలా అంటున్నారు.
కొరటాల శివ దర్శకత్వంలో నందమూరి కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూ.300 కోట్ల బడ్జెట్ తో దేవర ను నిర్మించారు. శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్ కథానాయికగా నటించగా.. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ , సైఫ్ అలీఖాన్ విలన్ గా నటించగా, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, అజయ్ తదితర సీనియర్లంతా నటించారు.
Read Also : Musk Dating Meloni: ఇటలీ ప్రధానితో ఎలాన్ మస్క్ డేటింగ్.. అసలు నిజమిదే..!