దేవర (Devara) నెగిటివ్ టాక్ రావడం తో బన్నీ ఫ్యాన్స్ (Allu Arjun Fans) హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు. దాదాపు ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ నుండి వచ్చిన మూవీ దేవర. ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమాను యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మించాయి. తారక్ తో జాన్వి కపూర్ జత కట్టగా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించారు. అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ అంచనాలు పెంచాయి. దీంతో సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని అభిమానులు ఎదురుచూసారు. అర్ధరాత్రి నుండే సంబరాలు మొదలుపెట్టారు. కానీ తీరా థియేటర్స్ లోకి వెళ్తే కానీ తెలియలేదు దేవర అసలు సత్తా ఏంటి అనేది. ఎన్నో అంచనాలను కొరటాల తలకిందులు చేసాడు.
ఆచార్య చూసి మెగా అభిమానులు ఎంత బాధపడ్డారో..ఇప్పుడు దేవర చూసి ఎన్టీఆర్ అభిమానులు అంతే బాధపడుతున్నారు. అయితే అల్లు అర్జున్ అభిమానులు మాత్రం ఫుల్ హ్యాపీ గా ఉన్నారు. సినిమా కు నెగిటివ్ టాక్ వచ్చిందని కాదు..ఈ సినిమాను అల్లు అర్జు రిజక్ట్ చేసాడని..అవును ఈ కథను ముందు గా శివ..బన్నీ కి వినిపించాడట. కానీ బన్నీ నో చెప్పడంతో కాస్త అటు ఇటు చేంజ్ చేసి ఎన్టీఆర్ కు వినిపించాడట. శివ పై నమ్మకం ..గతంలో జనతా గ్యారేజ్ వంటి సూపర్ హిట్ ఇవ్వడం తో ఎన్టీఆర్ ఏమాత్రం ఆలోచించకుండా రెండేళ్లు ఈ మూవీ కోసం డేట్స్ కేటాయించాడు. కానీ ఎన్టీఆర్ నమ్మకాన్ని శివ నిలుపుకోలేకపోయాడు. మరి దేవర పార్ట్ 2 విషయంలో జాగ్రత్తలు పడతారా..? లేక ఆ సినిమాను అలాగే వదిలేస్తారా..? అనేది చూడాలి.
Read Also : Supreme Court : ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ప్యానెల్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం