Site icon HashtagU Telugu

Devara Overseas Talk : అదొక్కటే మైనస్ తప్ప ..సినిమా బ్లాక్ బస్టర్

Devara Us Talk

Devara Us Talk

Devara Overseas Talk : యావత్ ఎన్టీఆర్ (NTR) అభిమానులతో పాటు సినీ ప్రముఖులు ఎదురుచూస్తున్న స‌మ‌యం రానే వ‌చ్చింది. ఆరేళ్లుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆక‌లితో ఉన్నారు..దేవర (Devara) తో ఆ ఆకలి తీరుతుందని గట్టి నమ్మకం గా ఉన్నారు. సినిమా తాలూకా సాంగ్స్ , ట్రైలర్ , ప్రమోషన్స్ ఇలా ప్రతిదీ సినిమా పై అంచనాలు పెంచడం తో సినిమా ఎలా ఉంటుందో..అనే టెన్షన్ కూడా కాస్త ఉంది. ఈ క్రమంలో ఓవర్సీస్ టాక్ కాస్త ఆందోళనకు గురి చేస్తుంది. ఇండియాలో కంటే ముందే ఓవర్సీస్ లో షోస్ పడతాయనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొద్దీ సేపటి క్రితం ప్రీమియర్ షోస్ పూర్తి కాగా..సినిమా ఉందనేది అభిమానులు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు.

కొంతమందేమో దేవర యాక్షన్స్ సన్నివేషాలు చాలా బాగున్నాయి అంటే మరి కొంతమంది స్క్రీన్ ప్లే రివర్స్ లో ఉండడం కారణంగా ఈ సినిమా చూసి ఆడియన్స్ కాస్త కన్ఫ్యూజన్లో పడిపోతారని అంటున్నారు.. సినిమాకు ఒకే ఒక్క మైనస్ తప్ప మిగిలినవి అన్ని బాగానే ఉన్నాయని చెబుతున్నారు. జాన్వీ స్క్రీన్ స్పేస్ కూడా తక్కువగానే ఉంటుందని, ఈమె సెకండాఫ్ లో ఎంట్రీ ఇస్తుందని తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ యాక్టింగ్ మాములుగా లేదని, సైఫ్ ఆలీ ఖాన్ అయితే తన పాత్రలో లీనమై పోయడానికి ట్వీట్స్ చేస్తున్నారు. ఒక్క రివర్స్ స్క్రీన్ ప్లే ని అర్థం చేసుకుంటే సినిమా మొత్తం చాలా అమేజింగ్ గా ఉంటుందని అంటున్నారు. మరి మన ఆడియన్స్ కు ఎలా ఉంటుందో చూడాలి.

ఇదిలా ఉంటె ఈ సినిమాను ఈ మిడ్ నైట్ 1 గంట‌ల‌కు స్పెష‌ల్ షో వేయ‌నున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే దీనికి సంబంధించిన టికెట్లు కూడా అమ్ముడ‌యిపోయాయి. అయితే 1 గంట‌ల షోల ప‌రంగా ఈ సినిమా అరుదైన రికార్డును అందుకోనుంది. దాదాపు 500 పైగా థియేట‌ర్‌ల‌లో ఈ సినిమాను అర్ధరాత్రి 1 గంట‌ల‌కు స్పెష‌ల్ షో వేయ‌నున్న‌ట్లు స‌మాచారం. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. సైఫ్ అలీ ఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరేన్, కలైయరసన్, అజయ్ మరియు అభిమన్యు సింగ్ కూడా కీలక పాత్రలలో నటించారు.

Read Also : PM Modi: ‘పరమ రుద్ర’ సూపర్‌ కంప్యూటర్లను ఆవిష్కరించిన ప్రధాని మోడీ