VD12 రౌడీ హీరో విజయ్ దేవరకొండ లీడ్ రోల్ లో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమాను గౌతం తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్నారని తెలిసిందే. సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. సినిమాలో విజయ్ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. ఐతే విడి 12వ సినిమాగా రాబోతున్న ఈ సినిమా టీజర్ త్వరలో రాబోతుంది. ఈ టీజర్ కి నందమూరి హీరోల్లో ఒకరు వాయిస్ ఓవర్ ఇస్తారని లేటెస్ట్ టాక్.
అటు బాలకృష్ణ కానీ లేదా ఎన్టీఆర్ కానీ ఇద్దరిలో ఒకరు విజయ్ దేవరకొండ (Devarakonda) సినిమా టీజర్ కు వాయిస్ ఓవర్ ఇస్తారని టాక్. దేవరకొండ ఈ సినిమాపై పూర్తి ఫోకస్ తో ఉన్నాడు. విజయ్ దేవరకొండ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ఈ టైం లో గౌతం తిన్ననూరితో చేస్తున్న ఈ సినిమా ఫ్యాన్స్ ఆకలి తీర్చేలా చేయాలని చూస్తున్నాడు.
Also Read : Teja Sajja : హనుమాన్ హీరో పర్ఫెక్ట్ ప్లానింగ్..!
ఈ ఇయర్ వచ్చిన ఫ్యామిలీ స్టార్ సినిమా అంచనాలను అందుకోలేదు. అందుకే గౌతం తిన్ననూరి సినిమా మీద స్పెషల్ ఫోకస్ పెట్టాడు విజయ్ దేవరకొండ. ఇదే కాదు నెక్స్ట్ రవి కిరణ్, రాహుల్ సంకృత్యన్ సినిమాలతో కూడా విజయ్ భారీ టార్గెట్ ని పెట్టుకున్నట్టు తెలుస్తుంది. మరి విజయ్ మార్క్ ఎంటర్టైనర్ గా ఫ్యాన్స్ కి ఈ సినిమా ఫీస్ట్ అందిస్తుందా లేదా అన్నది చూడాలి.
Devara ఎన్టీఆర్ వాయిస్ తో విజయ్ దేవరకొండ టీజర్ అన్న వార్తలకు సినిమా నిర్మాత నాగ వంశీ చెక్ పెట్టారు. బాలయ్య, ఎన్ టీ ఆర్ మాత్రమే కాదు మహేష్, బన్నీ, వెంకటేష్ కూడా ఉన్నారా అని వెటకారం చేశారు. డైరెక్ట్ గా ప్రొడ్యూసర్ రంగంలోకి దిగాడంటే ఈ వార్త నిజం కాదని తేలిపోయింది.