న్యాచురల్ స్టార్ నాని దసరా తో సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తో మరో సినిమా చేస్తున్నాడు. దసరా నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ సినిమా నిర్మిస్తున్నారు. నాని శ్రీకాంత్ ఓదెల ఈ కాంబో అనగానే అందరు దసరా లాంటి మరో సినిమా ఎక్స్ పెక్ట్ చేస్తారు. కానీ ఈసారి నాని అంతకుమించి సినిమా ఇవ్వబోతున్నాడని అర్ధమవుతుంది. సినిమా విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమా చేస్తున్నారని తెలుస్తుంది.
నాని శ్రీకాంత్ ఓదెల సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా అనిదుర్, దేవి శ్రీ ప్రసాద్ లలో ఒకరిని తీసుకోవాలని అనుకున్నారు. ఐతే అనిరుద్ ఈమధ్య వరుస సినిమాలతో సూపర్ ఫాం లో ఉండటం వల్ల అతనికే దసర 2 కాంబో ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈమధ్యనే ఎన్టీఆర్ దేవర (Devara) సినిమాకు మ్యూజిక్ అందించాడు అనిరుద్ (Anirudh). ఆ సినిమాకు అతని మ్యూజిక్ ఎంత ప్లస్ అయ్యిందో తెలిసిందే.
మ్యూజిక్ హైలెట్ అయ్యేలా..
ఇప్పుడు నాని (Nani) శ్రీకాంత్ ఓదెల సినిమాకు కూడా ఈ మ్యూజిక్ హైలెట్ అయ్యేలా చేయాలని చూస్తున్నారు. ఆల్రెడీ నానీనిత్ అనిరుద్ జెర్సీ సినిమాకు వర్క్ చేశారు. ఆ సినిమా మ్యూజిక్ పరంగా ఎంత మంచి క్రేజ్ తెచ్చుకుందో తెలిసిందే. ఇప్పుడు దసర 2 కాంబో సినిమాకు కూడా అదే రేంజ్ వైబ్స్ తీసుకు రావాలని చూస్తున్నారు.
దసరా కాంబో రిపీట్ అవుతున్న ఈ టైం లో అంచనాలను ఏమాత్రం తగ్గకుండా శ్రీకాంత్ ( Srikanth Odela) సినిమా కోసం తన ఫుల్ ఎఫర్ట్ పెట్టేస్తున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతుందని తెలుస్తుంది.
Also Read : Prabhas : మలయాళ భామతో ప్రభాస్ రొమాన్స్..!