Site icon HashtagU Telugu

Devara : దేవర పార్ట్ 1 షూటింగ్ పూర్తి అయ్యేది అప్పుడే.. ఇంకెంత షూట్ ఉంది ఏంటి..!

Ntr Janhvi Kapoor Devara Part 1 Shooting Update

Ntr Janhvi Kapoor Devara Part 1 Shooting Update

Devara : కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘దేవర’. కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు పార్టులుగా రూపొందుతుంది. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ఏప్రిల్ 5న అంటే రేపు రిలీజ్ కావాల్సి ఉంది. కానీ చిత్రీకరణ ఇంకా పూర్తి కాకపోవడంతో.. సినిమా రిలీజ్ ని వాయిదా వేశారు. ఏప్రిల్ నుంచి అక్టోబర్ కి తీసుకు వెళ్లిపోయారు. అయితే షూటింగ్ పూర్తి అవ్వలేదు అంటే.. ఏదో కొంచెం చిత్రీకరణ బ్యాలన్స్ ఉంది అనుకున్నారు. కానీ దేవర పార్ట్ 1 షూటింగ్ పూర్తి అవ్వడానికే.. ఇంకో రెండు నెలలు సమయం పడుతుందట.

ఈ మూవీ మొదటి భాగం షూటింగ్ ని ప్రస్తుతం శరవేగంగా ముందుకు తీసుకు వెళ్తున్నారు. ఒక షెడ్యూల్ పూర్తి అయిన తరువాత మరో షెడ్యూల్ ని స్టార్ట్ చేస్తూ వస్తున్నారు. ఇటీవలే గోవాలో ఓ సాంగ్ షూటింగ్ షెడ్యూల్ ని పూర్తి చేసారు. త్వరలోనే మరో కొత్త షెడ్యూల్ ని కూడా మొదలు పెట్టనున్నారు. కాగా ఈ పార్ట్ 1 షూటింగ్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి.. మే నెల ఎండ్ లేదా జూన్ ఎండ్ పడుతుందట. అంటే దాదాపు ఇంకా రెండు మూడు నెలల పాటు ఈ మూవీ షూటింగ్ జరుపుకోనుంది.

కాగా ఈ మూవీ రిలీజ్ కి చాలా సమయం ఉండడంతో మేకర్స్.. రిలాక్స్ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నెల చివరి నుంచి ఎన్టీఆర్ వార్ 2 మూవీ షూటింగ్ లో కూడా పాల్గొనున్నారు. ఆ సినిమా షూటింగ్ పూర్తి చేయడం కోసం ఎన్టీఆర్ రెండు నెలల కాల్ షీట్స్ ఇచ్చినట్లు సమాచారం. వార్ 2 షూటింగ్ ని చేస్తూనే దేవర పార్ట్ 1 చిత్రీకరణ పూర్తి చేయనున్నారని తెలుస్తుంది. కాగా దేవర సినిమాలో జాన్వీ కపూర్, శృతి మరాఠే హీరోయిన్స్ గా నటిస్తుంటే సైఫ్ అలీఖాన్ విలన్‌గా చేస్తున్నారు.

Also read : Mahesh-Rajamouli: సినిమా మొదలవ్వకముందే అలాంటి రికార్డు సృష్టించిన జక్కన్న.. చరిత్రలో అదో రికార్డ్!