బాలీవుడ్ భామ దీపికా పదుకొనే (Deepika Padukone)..పండంటి బాబుకు జన్మనిచ్చినట్లు తెలుస్తుంది. ఏడు నెలల గర్భం తర్వాత రణవీర్ సింగ్ – దీపికా పదుకొనే తల్లిదండ్రులు అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరిలో దీపికా పదుకొనే ప్రెగ్నెంట్ విషయాన్ని తెలిపింది. అంటే సెప్టెంబర్‌లో దీపిక డెలివరీ కావాల్సి ఉంది. కానీ… ఏడు నెలలకే దీపికా ఓ బిడ్డ కు జన్మనిచ్చినట్లు సమాచారం. దీపికా ఇటీవల ప్రభాస్ (Prabhas)హీరోగా , నాగ్ అశ్విన్ (Nag Ashwin)దర్శకత్వంలో కల్కి 2898AD సినిమాలో హీరోయిన్ గా నటించింది. అంతేకాదు ఈ సినిమాతో తొలిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమాలో గర్భవతిగా నటించిన విషయం తెలిసిందే.
We’re now on WhatsApp. Click to Join.
డెలివరీ తర్వాత రెండు సంవత్సరాల పాటు సినిమా ఇండస్ట్రీకి దూరం కానుంది అంటూ గతంలో వార్తలు వచ్చాయి. పుట్టిన బిడ్డ యొక్క అలనా పాలన చూసుకోవడానికి దీపికా ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. అందులో భాగంగానే దాదాపు రెండు సంవత్సరాల పాటు కల్కి సీక్వెల్ కూడా వాయిదా పడబోతోందని తెలుస్తోంది. ముఖ్యంగా కల్కి సీక్వెల్ లో దీపికా పదుకొనే పాత్ర అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందట. అందుకే ఆమెను ఈ సినిమాలో భాగం చేయడం కోసం మరో రెండు సంవత్సరాలు చిత్ర బృందం ఎదురు చూడాల్సిందే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం దీపిక డెలివరీ అయిందని, కొడుకు పుట్టాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
Read Also : KTR : నా వ్యాఖ్యలపై ఇప్పటికే మహిళలకు క్షమాపణలు చెప్పాను: కేటీఆర్