Site icon HashtagU Telugu

Dancing Queen Sreeleela : కిస్సిక్‌ సాంగ్‌..ఏ రేంజ్ లో ఉపుతుందో..!!

Srileela Pushpa2

Srileela Pushpa2

పుష్ప 2 మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ మేకర్స్ సినిమా తాలూకా సరికొత్త విశేషాలు తెలియజేస్తూ సినిమా పై అంచనాలు , ఆసక్తి పెంచేస్తున్నారు. తాజాగా ఐటెం సాంగ్ తాలూకా అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేసి ఊపు తెప్పించారు. సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో చెప్పాలిన పనిలేదు. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది. అల్లు అర్జున్ నటనకు ఏకంగా జాతీయ అవార్డు లభించింది. అంతే కాదు బన్నీ క్రేజ్ ఈ సినిమా తర్వాత బీభత్సంగా పెరిగింది. ఎక్కడ చూసిన అల్లు అర్జున్ (Allu Arjun) పేరే వినిపిస్తుంది.

ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎలా ఉండబోతుంది.? కథలో ఎలాంటి ట్విస్ట్ లు ఉంటాయి.? అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమాను డిసెంబర్ 05 న ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నట్లు రీసెంట్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ లోని ఐటెం సాంగ్ తాలూకా వివరాలు అధికారికంగా ప్రకటించారు. రెండు రోజుల క్రితం ఈ సాంగ్ తాలూకా పిక్స్ బయటకు వచ్చి వైరల్ గా మారింది. ఈ క్రమంలో మేకర్స్ ఈ సాంగ్ కు సంబంధించి అధికారిక ప్రకటన చేసారు. శ్రీలీలపై ఓ స్పెషల్‌ మాసివ్‌ కిస్సిక్‌ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్‌ అధికారికంగా విడుదల చేశారు. అల్లు అర్జున్, శ్రీలీల ఎంత మంచి డ్యాన్సర్లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటిది ఈ ఇద్దరు కలిసి చిందేస్తే సాంగ్ ఓ రేంజ్ హిట్ అవుతుంది అనడంలో డౌట్ లేదు.

Read Also : Afternoon Nap Benefits: మ‌ధ్యాహ్నం అర‌గంట నిద్ర‌పోతే ఇన్ని లాభాలా!