బుధువారం రాత్రి తిరుపతి లో జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ‘డాకు మహరాజ్’ ప్రీ రిలీజ్ వేడుక రద్దు చేసారు. నందమూరి బాలకృష్ణ (Balakrishna) – వాల్తేర్ వీరయ్య తర్వాత బాబీ (Bobby) డైరెక్షన్ లో వస్తున్న డాకు మహారాజ్ (Daaku Maharaaj ) పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఆ అంచనాలను ఏమాత్రం తగ్గకుండా సినిమాను తెరకెక్కించినట్లు మేకర్స్ చెపుతున్నారు. జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ తాలూకా ప్రీ రిలీజ్ వేడుకను అనంతపురంలో అట్టహాసంగా నిర్వహించాలని ప్లాన్ చేసారు.
Ex Gratia: బాధిత కుటుంబాలకు రూ. 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా: మంత్రి
ఈ ఈవెంట్ కు నారా లోకేష్ ముఖ్య అతిధిగా హాజరు కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఏర్పాట్లు కూడా పూర్తీ చేసారు. కానీ సడెన్ గా నిన్న బుధవారం రాత్రి తిరుపతిలో వైకుంఠ దర్శనం టోకెన్స్ జారీ చేసే సమయంలో క్యూలైన్స్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందారు. ఆ కారణంగా డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రద్దు చేశారు.
ఈ విషయాన్ని నిర్మాత నాగవంశీ ప్రకటించారు. ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ లో మరో ఈవెంట్ ను ప్లాన్ చేస్తారెమో చూడాలి. భారీ బడ్జెట్ పై హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాధ్ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండంగా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా కీలక పాత్రలో కనిపించనుంది.