వరుస హిట్ల తో ఫుల్ స్వింగ్ లో ఉన్న నందమూరి బాలకృష్ణ..సంక్రాంతి బరిలో ‘డాకు మహారాజ్’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు. నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) ఫేమ్ బాబీ(Boby) కలయికలో తెరకెక్కిన ఈ మూవీ జనవరి 12న విడుదలయ్యింది. ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్, ఊర్వశీ రౌతేలా, చాందినీ చౌదరి హీరోయిన్లు నటించారు. థమన్ మ్యూజిక్ అందిస్తుండగా, సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించారు. విడుదలకు ముందే పాజిటివ్ బజ్ తెచ్చుకున్న ఈ మూవీ..విడుదల తర్వాత కూడా అదే టాక్ రావడం తో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది.
Allu Arjun-Trivikram Film : కొత్త సినిమా షూటింగ్ లో బిజీ కాబోతున్న బన్నీ
ఈ చిత్రానికి ఆరు రోజుల్లోనే రూ. 124+కోట్లు (గ్రాస్) వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. ‘బ్లాక్ బస్టర్.. కింగ్ ఆఫ్ సంక్రాంతి’ అంటూ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. ఈరోజు సండే కావడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని సినీవర్గాలు పేర్కొన్నాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు ( డే 1) రూ.56 కోట్లు వసూళ్లు రాబట్టినట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. సంక్రాంతి రేసులో నిలిచిన ఈ మూవీ రికార్డు స్థాయిలో వసూళ్లు కలెక్షన్స్ అందుకుంది. రెండవ రోజు రూ. 13.50 కోట్లు, మూడవ రోజు రూ.12.50 కోట్లు, నాలుగవ రోజు రూ. 9.75 కోట్లు, ఐదోవ రోజు రూ. 6.25 కోట్లు, ఆరోవ రోజు రూ. 4.2 కోట్లు అందుకుంది.
TikTok Ban : టిక్‌టాక్‌పై బ్యాన్ అమల్లోకి.. ఆశలన్నీ ట్రంప్ ఆఫర్‌పైనే
ఇక ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే.. బాలయ్య బాబు 50 ఏళ్ల సినీ కెరీర్ లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీగా ‘డాకు మహారాజ్’నయా రికార్డు క్రియేట్ చేసింది. ఈ మూవీ 80 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. ఓవరాల్ గా బాలయ్య ఖాతాలో మరో హిట్ పడడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.