హీరో నాని నిర్మాతగా తెరకెక్కించిన ‘కోర్టు’ (Court) మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మల్లేశం, బలగం వంటి సినిమాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన ప్రియదర్శి.. తాజాగా కోర్ట్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా మార్చి 14న ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది. ప్రియదర్శి, హర్ష్ రోషన్, సాయికుమార్, శివాజీ, హర్షవర్థన్, రోహిణి, రాజశేఖర్ అనింగి, సురభి ప్రభావతి, విషికా కీర్తి, శ్రీదేవి అపాళ్ల తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. విజయ్ బుల్గానియన్ సంగీత దర్శకత్వం వహించగా.. రామ్ జగదీష్ కోర్ట్ మూవీని డైరెక్ట్ చేశారు.
Minister Lokesh : ఏపీలో ఒంటిపూట బడుల సమయంలో మార్పులు
వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్నేనేని ఈ సినిమాను నిర్మించగా.. నాని సమర్పకుడిగా వ్యవహరించారు. ఇక ఈ మూవీ కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ చిత్రం నిన్న సోమవారం రూ.4 కోట్ల వరకు వసూలు చేయడంతో నాలుగు రోజుల్లో రూ.28.9 కోట్లు వచ్చినట్లు సినీవర్గాలు తెలిపాయి. ఈ వీక్లో రూ.50 కోట్ల క్లబ్లోకి చేరే అవకాశం ఉంది. ‘వాల్ పోస్టర్ సినిమా’ నుంచి వచ్చిన awe, hit1&2, కోర్టు భారీ విజయాలను అందుకున్నాయి.