Copy Vs Inspire : పాటల ట్యూన్ కాపీయింగ్‌పై ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాటల ట్యూన్‌ను కాపీ చేయడం, వాటిని విని ఇన్‌స్పైర్ కావడం అనేవి రెండు వేర్వేరు విషయాలని ఆయన చెప్పారు. ఒక పాటను విని స్ఫూర్తి పొందడం ద్వారా, అలాంటిదే మరో పాటను తయారు చేయొచ్చన్నారు. అది కాపీ కొట్టడం కిందికి రాదన్నారు. తన పాటలను చాలామంది కాపీ కొట్టి, మిమ్మల్ని చూసి ఇన్‌స్పైర్ అయ్యామని కూల్‌గా చెప్పేశారని దేవిశ్రీ ప్రసాద్ పేర్కొన్నారు.
Also Read :Trump Vs 41 Countries : 41 దేశాలపై ట్రంప్ ట్రావెల్ బ్యాన్.. భారత్ పొరుగు దేశాలపైనా..!!
రీమేక్స్ అస్సలు చేయను
‘‘నేను ఇతరుల పాటలను అస్సలు కాపీ(Copy Vs Inspire) కొట్టను. ఇతరుల పాటలకు రీమేక్స్ కూడా చేయను. ఇప్పటివరకు నేను ఏ సినిమాకు కూడా రీమేక్ సాంగ్స్ చేయలేదు. గద్దలకొండ గణేష్ మూవీలో ఒక పాట రీమేక్ చేయమని నన్ను అడిగారు. దీంతో ఆ సినిమానే వదిలేశాను’’ అని ఆయన తెలిపారు. సినిమా డైరెక్టర్ కథ చెబుతుంటే తాను ఆడియన్స్‌లా వింటానన్నారు. ‘‘సుకుమార్‌కు లిరిక్స్‌పై పట్టు ఉంటుంది. అందుకే ‘పుష్ప2’లో జాతర పాటను 10 నిమిషాల్లోనే చేయగలిగాం. సూసేకీ పాట విని సుకుమార్, చంద్రబోస్ ఇద్దరూ డాన్స్ చేశారు’’ అని ఆయన గుర్తు చేసుకున్నారు.
Also Read :YS Viveka : సాక్షుల మరణాలపై అనుమానం ఉంది.. వైఎస్ సునీత సంచలన వ్యాఖ్యలు
100 రోజుల్లో 3 విభిన్న జోనర్లు
చివరిగా అక్కినేని నాగచైతన్య ‘తండేల్’, అల్లు అర్జున్ ‘పుష్ఫ2 : ది రూల్’, తమిళ స్టార్ సూర్య ‘కంగువా’ సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేశారు. 100 రోజుల గ్యాప్‌లోనే మూడు విభిన్న జోనర్లలో దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. గతంలో ఒకే ఏడాది వ్యవధిలో 8 సినిమాలకు ఆయన వర్క్ చేసి హిట్లు అందుకున్నారు. తదుపరిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘కుబేరా’, ‘వృషభ’ వంటి సినిమాల కోసం దేవిశ్రీ ప్రసాద్ వర్క్ చేస్తున్నారు.