Site icon HashtagU Telugu

Attack on Saif Ali Khan : సైఫ్‌పై దాడి కేసులో కీలక మలుపు.. ఇంట్లో ఉన్నవాళ్ల పనేనా ?

Saif Ali Khan

Saif Ali Khan

Attack on Saif Ali Khan : ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి అంశం గురించే ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. ఈ కేసును ముంబై పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. సైఫ్‌పై దాడి చేసింది ఎవరు ? అనేది తెలుసుకునే క్రమంలో ముంబైలోని సైఫ్ ఇంట్లో ఉన్న మొత్తం సీసీటీవీ ఫుటేజీని సేకరించి నిశితంగా పరిశీలించారు. అయితే సైఫ్‌పై దాడి జరగడానికి ముందు.. వారి ఇంట్లోకి బయటివాళ్లు ఎవరూ ప్రవేశించినట్టుగా ఆధారాలు లేవు. బయటివాళ్లు ఇంట్లోకి రానప్పుడు.. అప్పటికే ఇంట్లో ఉన్నవాళ్లలో ఎవరో ఒకరు ఈ దాడి చేసి ఉండొచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  సైఫ్‌పై దాడికి కుట్ర, దాడి రెండు కూడా ఇంట్లోనే జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇవాళ (గురువారం) తెల్లవారుజామున 2 గంటలకు సైఫ్ అలీఖాన్(Attack on Saif Ali Khan) ఇంట్లో దొంగ అలికిడి వినిపించింది. దీన్ని తొలుత వారి ఇంట్లో పనిచేసే ఏలియామా ఫిలిప్స్ అలియాస్ లీమా అనే మహిళ గుర్తించింది. ప్రస్తుతం పని మనిషి ఏలియామా ఫిలిప్స్ అలియాస్ లీమాను బాంద్రా పోలీసు స్టేషన్‌లో పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. దొంగ తొలుత తనపైనే దాడి చేశాడని ఆమె పోలీసులకు చెప్పినట్లు సమాచారం.

Also Read :KTR Vs ED : కేటీఆర్‌‌పై ప్రశ్నల వర్షం.. ఈడీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత.. దూసుకొచ్చిన బీఆర్‌ఎస్ శ్రేణులు

సైఫ్ వెన్నుభాగంలో సర్జరీ

పని మనిషి ఏలియామా ఫిలిప్స్ అలియాస్ లీమా అరవడంతో సైఫ్ అలీఖాన్ నిద్రలేచి.. ఆ దొంగను పట్టుకోబోయారు. ఈక్రమంలో సదరు దొంగ సైఫ్‌పై ఆరుసార్లు కత్తిపోట్లు పొడిచాడు.  సైఫ్ మెడ‌, చేయి, వెన్ను భాగాల్లో కత్తిపోట్లను వైద్యులు గుర్తించారు. రెండు చోట్ల ఆ క‌త్తి పోట్లు లోతుదాకా వెళ్లాయని తెలిపారు. 2 గంటలకు సైఫ్‌పై దాడి జరిగితే.. ఆయనను 3.30 గంటలకు తమ ఆస్పత్రికి తీసుకొచ్చారని  ముంబైలోని లీలావతి ఆస్పత్రివర్గాలు తెలిపాయి. సైఫ్ వెన్నులో దిగిన వ‌స్తువును స‌ర్జ‌రీ ద్వారా తొల‌గించామని వెల్లడించాయి. రెండున్న‌ర గంట‌ల పాటు సైఫ్‌కు స‌ర్జ‌రీ జరిగింది. ప్ర‌స్తుతం ఆయన ఆప‌రేష‌న్ థియేట‌ర్ రూంలోని రిక‌వ‌రీ రూమ్‌లో ఉన్నారు. సైఫ్ ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు లేదని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. న్యూరోస‌ర్జ‌న్ నితిన్ దంగే, కాస్మిటిక్ స‌ర్జ‌న్ లీనా జైయిన్‌, అన‌స్థ‌టిస్ట్ నిషా గాంధీ ప్ర‌స్తుతం సైఫ్‌కు చికిత్స అందించారు.

Also Read :PV Narasimha Rao : 20 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ హెడ్ క్వార్టర్‌లో పీవీ నరసింహారావు ఫొటోలు

సైఫ్, కరీనాకపూర్ స్టేట్‌మెంట్లను..

సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగిన సమయంలో ఇంట్లో ఎవరెవరు ఉన్నారు ?  పని మనుషులు ఎవరెవరు ఉన్నారు ? పని మనుషుల నేపథ్యం ఏమిటి ?  అనే సమాచారంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై సైఫ్ అలీఖాన్, ఆయన భార్య కరీనాకపూర్ స్టేట్‌మెంట్లను పోలీసులు నమోదు చేయనున్నారు. వారు నివసిస్తున్న అపార్ట్ మెంట్ సెక్యూరిటీ సిబ్బంది నుంచి సైతం వివరాలను సేకరిస్తారు. సైఫ్ తన భార్య క‌రీనా క‌పూర్‌, ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి స్విట్జ‌ర్లాండ్‌లో న్యూ ఇయర్ వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు. వారం క్రితమే ముంబైకు తిరిగొచ్చారు.