Site icon HashtagU Telugu

Coolie & War 2 Collections : కూలీ, వార్ 2 ఫస్ట్ డే కలెక్షన్స్

Coolie War2

Coolie War2

గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన కూలీ , వార్డు 2 చిత్రాలు అడ్వాన్స్ బుకింగ్‌లలో హోరాహోరీగా పోటీపడ్డాయి. అయితే భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాలకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. క్రిటిక్స్ రేటింగ్స్, రివ్యూలు కూడా ఆశించిన స్థాయిలో లేవని తేల్చి చెప్పాయి. అయినప్పటికీ, ఈ సినిమాల టికెట్లు రికార్డు స్థాయిలో అమ్ముడవుతూ ఉండటం విశేషం. మిశ్రమ టాక్ ఈ సినిమాల కలెక్షన్‌లను పెద్దగా ప్రభావితం చేయలేదని అర్థమవుతోంది.

రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కూలీ’ సినిమాలో నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర వంటి స్టార్స్ నటించడంతో విడుదలకు ముందే సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్, మరియు అనిరుధ్ రవిచందర్ సంగీతం కూడా సినిమాపై ఆసక్తిని పెంచాయి. మరోవైపు, జూనియర్ ఎన్టీఆర్ నటించిన మొట్టమొదటి హిందీ చిత్రం ‘వార్ 2’ పై కూడా తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. హృతిక్ రోషన్ మరో హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్‌లో భాగం.

SBI : గుడ్ న్యూస్.. లోన్ వడ్డీ రేట్లను తగ్గించిన SBI

‘కూలీ’, ‘వార్ 2’ సినిమాల రెండూ ప్రేక్షకులు, ట్రేడ్ వర్గాల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించాయి. అడ్వాన్స్ బుకింగ్‌లు ఈ క్రేజ్‌కు తగ్గట్టుగానే జరిగాయి. తొలి రోజు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, రెండు సినిమాలకూ ఒకే రకమైన టాక్ ఉండటంతో బుకింగ్‌లపై దాని ప్రభావం పెద్దగా కనిపించలేదు. గురువారం ఈవెనింగ్ మరియు సెకండ్ షోలు దాదాపు అన్ని ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ అయ్యాయి. శుక్రవారం ఇండిపెండెన్స్ డే సెలవుదినం కావడంతో ఈ సినిమాలకు మరింత కలిసొచ్చింది. టాక్‌తో సంబంధం లేకుండా టికెట్ బుకింగ్‌లు కొనసాగుతున్నాయి.

ప్రాంతాల వారీగా బుకింగ్‌లలో కొంత తేడా ఉన్నప్పటికీ, మొత్తం మీద చూసుకుంటే రెండు చిత్రాలూ భారీ ఓపెనింగ్స్ సాధించనున్నాయి. శని, ఆదివారాల్లో కూడా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ గ్యారంటీ అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమాలతో పాటు, ‘మహావతార్ నరసింహ’ అనే యానిమేషన్ సినిమాకు కూడా బుకింగ్స్ బాగున్నాయి. కొత్త సినిమాలకు మిశ్రమ టాక్ రావడంతో ఈ సినిమాకు ఇది కలిసివచ్చింది. ఇక మొదటి రోజు ‘వార్ 2’ దాదాపు రూ.55 – 60 కోట్ల వరకు వసూలు చేసి ఉండవచ్చని, ‘కూలీ’ రూ.160 – 170 కోట్ల మార్క్‌ను అందుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ కలెక్షన్స్‌పై మేకర్స్ అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.