సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna) ప్రస్తుతం ఉత్తాన దశలో ఉన్నారు. వరుసగా నాలుగు సినిమా హిట్లు (అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్), వరుసగా మూడుసార్లు MLAగా ఎన్నిక, బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ఛైర్మన్ గా పేదలకు సేవ, దేశంలోనే మూడో అత్యున్నత పురస్కారం పద్మ భూషణకు ఎంపిక కావడం ఆల్ టైమ్ హై అని ఆయన అభిమానులు అంటున్నారు. ఇలాగే బాలయ్య తన కెరీర్ కొనసాగించాలని వారు కోరుకుంటూ అభినందనలు తెలియజేస్తున్నారు.
Rashmika : రష్మిక కాలికి మూడు చోట్ల ఫ్రాక్చర్
మహేశ్ బాబు, రాజమౌళి, విజయ్ దేవరకొండ, వెంకటేశ్, అల్లు అరవింద్, చిరంజీవి, బాబీ, అనిల్ రావిపూడి, వరలక్ష్మీ శరత్ కుమార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ , బీఆర్ఎస్ నేత హరీశ్ రావు, శ్రీభరత్, కల్వకుంట్ల కవిత, సీఎం రమేశ్, నారా భువనేశ్వరి, అచ్చెన్నాయుడు ఇలా ఎంతో మంది శుభాకాంక్షలు తెలిపారు.
76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వ్యక్తులకు అత్యున్నత పౌర పురస్కారాలు అయిన పద్మ అవార్డులను ప్రకటించింది. 2025 సంవత్సరానికి గానూ, ఈ అవార్డులు ప్రకటించబడిన జాబితాలో అనేక గొప్ప వ్యక్తుల పేర్లు ఉన్నాయి. ఈ అవార్డులు కళలు, సాహిత్యం, వైద్యం, విద్య, సామాజిక సేవ, సైన్స్, ఇంజనీరింగ్, క్రీడలు, వాణిజ్యం, పరిశ్రమలు, పౌర సేవ వంటి అనేక రంగాలలోని ప్రముఖులకు ఇచ్చి, వారి విశేష కృషిని గుర్తించనున్నారు. పద్మవిభూషణ్ అవార్డుకు 7 గురు. 19 మంది వ్యక్తులకు పద్మభూషణ్ అవార్డు మరియు 113 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు. ఇక పద్మవిభూషణ్ అందుకున్న వారిలో గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ కూడా ఉన్నారు.