Site icon HashtagU Telugu

భారతీయుడు -2 టీం కు సీఎం రేవంత్ అభినందనలు

భారతీయుడు 2 (Bharateeyudu 2)టీం కు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అభినందనలు తెలిపారు. తెలంగాణ లో రోజు రోజుకు పెరిగిపోతున్న డ్రగ్స్ కు కట్టడి చేసేందుకు సీఎం రేవంత్ కంకణం కట్టుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాట వినిపించకూడదు..కనిపించకూడదు అని అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడిక్కడే మత్తు పదార్దాలను , గంజాయి , తదితర డ్రగ్స్ ను పట్టుకుంటూ వస్తున్నారు. అలాగే డ్రగ్స్ ఫై ప్రజల్లో అవగాహనా కల్పిస్తూ వస్తున్నారు. చిత్రసీమ కూడా డ్రగ్స్ ఫై అవగహన కల్పించాలని రీసెంట్ గా కోరారు. సినిమా వాళ్లు సమాజం నుంచి ఎంతో తీసుకుంటున్నారని.. వారి తోడ్పాటు కోసం కొంతైనా తిరిగివ్వాలని కోరారు. సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత సినీ పరిశ్రమపై ఉందని అన్నారు. ప్రతీ సినిమా విడుదల సందర్భంలో అదే నటీనటులతో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా షార్ట్ వీడియో చేయాలి. ప్రతీ సినిమా థియేటర్‌లో సినిమా స్క్రీనింగ్‌కు ముందు డ్రగ్స్ నియంత్రణ, సైబర్ క్రైమ్‌కు సంబంధించి వీడియో ఉచితంగా ప్రదర్శించేలా చూడాలి. ఈ నిబంధనలకు సహకరించినవారికే అనుమతుల విషయంలో ప్రభుత్వం సహకరిస్తుందన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

దీంతో ప్రతి సినీ నటులు ముందుకు వస్తు తమ బాధ్యతను కనపరుస్తున్నారు. తాజాగా భారతీయుడు 2 టీం కూడా డ్రగ్స్ ఫై అవగాహనా కల్పిస్తూ వీడియోస్ షేర్ చేసింది. డైరెక్టర్ శంకర్, నటులు కమల్ హాసన్ , సిద్దార్థ్ తదితరులు డ్రగ్స్ ఫై అవగాహనా కల్పించడం పట్ల సీఎం రేవంత్ హర్షం వ్యక్తం చేసారు. వారందరికీ అభినందనలు తెలియజేస్తూ ట్విట్టర్ (X) వేదికగా పోస్ట్ చేసారు.

శంకర్ – కమల్ హాసన్ కలయికలో భారతీయుడు 2 తెరకెక్కిన సంగతి తెలిసిందే. జులై 12 న వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

Read Also : YCP Leaders Missing : ఎక్కడయ్యా.. శ్రీకాకుళం వైసీపీ నేతలు..?