Manchu Family: రచ్చకెక్కిన ‘మంచు’ కుటుంబం.. విష్ణు దాడి చేసిన వీడియోను షేర్ చేసిన మనోజ్!

విష్ణు, మనోజ్ మధ్య గ్యాప్ ఏర్పడిందా? అంటే అవుననే సమాధానం ఇస్తున్నాడు మంచు మనోజ్.

  • Written By:
  • Updated On - March 24, 2023 / 12:43 PM IST

టాలీవుడ్ లో పెద్ద ఫ్యామిలీ అయిన మంచు ఫ్యామిలీలో గొడవలున్నాయా? విష్ణు, మనోజ్ మధ్య గ్యాప్ ఏర్పడిందా? అంటే అవుననే సమాధానం ఇస్తున్నాడు మంచు మనోజ్. మనోజ్ షేర్ చేసిన ఓ వీడియోతో మంచు వారింట్లో గొడవలు ఇప్పుడు రోడ్డున పడ్డాయని చెప్పక తప్పదు. మంచు మనోజ్ ఇంటిపైకి మంచు విష్ణు వచ్చి దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు మంచు మనోజ్ ఓ వీడియోను షేర్ చేశాడు. ఇలా ఇంటి మీదకు వచ్చి దాడి చేస్తాడంటూ విష్ణు విజువల్స్‌ను మనోజ్ షేర్ చేయడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

అయితే ఈ విజువల్స్‌లో మంచు విష్ణు కనిపించాడు. వీడియోలో కొందరిని తిడుతూ ఆగ్రహం వ్యక్తం చేయడం చూడొచ్చు. విష్ణుని అందరూ ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిగో అండి ఇలా ఇంటి మీదకు వచ్చి అందరినీ కొడుతుంటాడు అంటూ తన అన్న గురించి వీడియోను షేర్ చేశాడు మంచు మనోజ్. మంచు వారింట్లో ఇలాంటి ఏదో జరుగుతోందనే రూమర్లు ఇది వరకు వచ్చాయి. మంచు సోదరుల మధ్య మంచి బంధాలు లేవనే టాక్ వస్తూనే ఉంది. మంచు మనోజ్ గురించి మాట్లాడను.. అది వాడి పర్సనల్ అంటూ ఆ మధ్య ఓ సారి మంచు విష్ణు అన్నాడు. ఎవ్వరికీ తాను సలహాలు ఇవ్వను అంటూ తన తమ్ముడి గురించి పరోక్షంగా స్పందించాడు విష్ణు.

ఇక మంచు మనోజ్ భూమా మౌనికల పెళ్లిలోనూ మంచు విష్ణు కనిపించలేదు. అలా వచ్చి ఇలా వెళ్లినట్టు ఉన్నాడు. కానీ మంచు వారి సంబరాలు, వారి ఫోటోలు, వీడియోల్లో ఎక్కడా కూడా మంచు విష్ణు కనిపించలేదు. అప్పుడే అందరికీ కన్ఫామ్ అయింది. ఇలాంటి గొడవలేవో జరుగుతున్నాయని అంతా అనుకున్నారు. ఇప్పుడిలా వారంతటా వారే రోడ్డున పడ్డారు. ప్రస్తుతం మంచు మనోజ్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోతో మంచు కుటుంబంలో ఎప్పట్నుంచో గొడవలు ఉన్నాయని, ప్రస్తుత ఘటనతో స్పష్టమైందని టాలీవుడ్ లో కొందరు చర్చించుకుంటున్నారు.