Rs 99 Movie Ticket : మే 31న మూవీ టికెట్స్ ధర రూ.99 మాత్రమే

మే 31న(శుక్రవారం) సినిమా లవర్స్ డే. ఈసందర్భంగా దేశవ్యాప్తంగా రూ. 99కే మూవీ టికెట్ లభించనుంది.

Published By: HashtagU Telugu Desk
Rs 99 Movie Ticket

Rs 99 Movie Ticket

Rs 99 Movie Ticket : మే 31న(శుక్రవారం) సినిమా లవర్స్ డే. ఈసందర్భంగా దేశవ్యాప్తంగా రూ. 99కే మూవీ టికెట్ లభించనుంది. దాదాపు 4వేలకుపైగా స్క్రీన్లలో ఈ సబ్సిడీ  రేటుకే  మూవీ టికెట్స్ విక్రయించనున్నారు. పీవీఆర్, ఐనాక్స్, సినీపోలిస్ వంటి సంస్థల థియేటర్లలో కూడా టికెట్ రేట్లపై ఈ సబ్సిడీని అందిస్తారు. సినీ ప్రియులను మూవీ థియేటర్ల వైపు ఆకట్టుకునే లక్ష్యంతో మే 31న ఆ ఆఫర్‌ను అందిస్తున్నారు. ప్రేక్షకులను మళ్లీ సినిమా థియేటర్ల వైపు రప్పించే చర్యల్లో భాగంగా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది.

We’re now on WhatsApp. Click to Join

బుక్ మై షో, పేటీఎం, అమెజాన్ పే వంటి వాటి ద్వారా మూవీ టికెట్ బుక్ చేసుకునే వారు ఈ నెల 31న రూ.99తో పాటు జీఎస్టీ, కన్వీనియన్స్ ఫీజును అదనంగా పే చేయాలి. ఒకవేళ థియేటర్‌లో ఉన్న కౌంటరులో టికెట్ కొంటే జీఎస్టీ, ఇతర ఛార్జీల మోత ఉండదు. అయితే ఐమ్యాక్స్‌లోని రిక్లైనర్ సీట్లకు రూ. 99 టికెట్ ధర(Rs 99 Movie Ticket) వర్తించదు. ఈనెల 31న విడుదల కానున్నసినిమాల లిస్టులో  గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మిస్టర్ అండ్ మిసెస్ మహి, ఛోటా భీమ్ అండ్ ద కర్స్ ఆఫ్ డమ్ యాన్, హైక్యూ ద డంప్ స్టర్ బ్యాటిల్ ఉన్నాయి.

Also Read :Govt Action Plan : ‘కోడ్’ ముగియగానే రేవంత్ సర్కారు సంచలన నిర్ణయాలు

ఎన్నికల హడావుడి, ఐపీఎల్ ఫీవర్ కారణంగా ఈ సమ్మర్‌లో సినిమా థియేటర్లకు పబ్లిక్ రద్దీ తగ్గిపోయింది.  ఈ టైంలో పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ కాకపోవడంతో థియేటర్లకు వెళ్లేందుకు జనం పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఇక ఇదే సమయంలో విడుదలైన చిన్న సినిమాలు సినీ ప్రియులను పెద్దగా  ఆకట్టుకోలేకపోయాయి.

Also Read : Paytm – Adani : పేటీఎంలో వాటా కొనేయనున్న అదానీ ?

  Last Updated: 29 May 2024, 12:02 PM IST