మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని అందుకొని దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే ‘కాస్టింగ్ కౌచ్’ అంశంపై ఆయన స్పందిస్తూ, ఇండస్ట్రీ అద్దం లాంటిదని, మనం ఇచ్చే గౌరవాన్ని బట్టే తిరుగు గౌరవం లభిస్తుందని పేర్కొన్నారు. “అమ్మ, అన్నం, సక్సెస్… ఈ మూడు ఎప్పుడూ బోర్ కొట్టవు” అంటూ ఆయన చెప్పిన మాటలు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
పరిశ్రమలో వేధింపుల గురించి వస్తున్న వార్తలపై క్లారిటీ ఇస్తూ, ఇక్కడ కాస్టింగ్ కౌచ్ అనేదే లేదని చిరంజీవి అభిప్రాయపడ్డారు. నటనపై ఆసక్తి ఉన్న పిల్లలను తల్లిదండ్రులు ధైర్యంగా ఎంకరేజ్ చేయాలని ఆయన సూచించారు. మన ప్రవర్తన సరిగ్గా ఉండి, ప్రొఫెషన్‌కు కట్టుబడి క్రమశిక్షణతో పని చేస్తే ఎవరూ ఏమీ చేయలేరని చిరు స్పష్టం చేశారు. చిత్ర పరిశ్రమ ఒక పవిత్రమైన దేవాలయం లాంటిదని, కష్టపడే తత్త్వం ఉన్నవారికి ఇక్కడ అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందని ఆయన యువతకు భరోసా ఇచ్చారు.
Chiru Speech
ఇక సినిమా విషయానికి వస్తే, ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా కేవలం మొదటి వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹100 కోట్ల మార్కును దాటేసింది. ప్రస్తుతం రూ.300 కోట్లు కలెక్ట్ చేసి చిరు కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. చిరంజీవి తన వింటేజ్ కామెడీ టైమింగ్ మరియు మేనరిజమ్స్‌తో ప్రేక్షకులను అలరించడం ఈ సినిమా విజయానికి ప్రధాన కారణం. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం, అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తూ చిరంజీవి కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
