అక్కినేని నాగేశ్వర్ రావు జాతీయ వేడుక (Akkineni Nageshwar Rao National Awards Celebration)లను ఘనంగా జరిపేందుకు అక్కినేని ఫ్యామిలీ (Akkineni Family ) అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ANR అవార్డ్స్-2024 వేడుకకు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) మరియు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) లు హాజరుకాబోతున్నారు.ఈ ఇద్దరు మెగా స్టార్స్ హాజరుకాబోతుండడంతో కార్యక్రమానికి మరింత హైప్ ఏర్పడుతుంది. చిరంజీవి ఈ కార్యక్రమంలో ANR నేషనల్ అవార్డును అందుకోబోతున్నారు.
1923 సెప్టెంబర్ 20న అక్కినేని నాగేశ్వర్ రావు జన్మించారు. సెప్టెంబర్ 20, 2024 నాటికీ శత జయంతి కావడంతో అక్కినేని ఫ్యామిలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇది వరకు ఎన్నడూ లేని విధంగా ఎన్నార్ సినిమాలని ప్రదర్శించి ఘనమైన నివాళ్లు ప్రకటించడం జరిగింది. అలాగే ప్రతియేడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించే ఎన్నార్ జాతీయ అవార్డు (ANR NATIONAL AWARD) ని ఈ నెల (అక్టోబర్) 28న ప్రధానం చేయనున్నారు. ఈ వేడుకకు సినీ ప్రముఖులు , అభిమానులు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు.
2006లో అక్కినేని 83వ పుట్టినరోజు సందర్భంగా ఈ ఆనవాయితీ ప్రారంభం అయ్యింది. ఇప్పటి వారికి దేశంలోని వివిధ భాషలకు సంబంధించి ప్రతిభావంతులైన లెజెండ్స్ ఈ అవార్డును అందుకున్నారు. కాగా ఈ ఏడాది అక్కినేని శత జయంతి వేడుకల్లో నాగార్జున మాట్లాడుతూ.. ఈ సారి అవార్డును మెగాస్టార్ చిరంజీవికి అందించనున్నట్లు ప్రకటించాడు. ఈ అవార్డును ప్రధానం చేసేందుకు బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ రానున్నట్లు తెలిపారు. తాజాగా నాగ్.. చిరంజీవిని మర్యాదగా కలిసి ఆహ్వానించాడు.
Read Also : Crpf Schools : సీఆర్పీఎఫ్ స్కూల్స్ మూసేయండి.. భారత్‌కు పన్నూన్ హెచ్చరిక..