పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం సినిమాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. పెండింగ్లో ఉన్న సినిమాల షూటింగ్ లను పూర్తి చేసి పనిలో పడ్డారు. ఇప్పటికే హరిహర వీరమల్లు షూటింగ్ ను పూర్తి చేసి రిలీజ్ కు సిద్ధం చేసిన ఆయన..ప్రస్తుతం OG తో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) చిత్రాల షూటింగ్ లను పూర్తి చేయాలనీ చూస్తున్నాడు. రెండు చిత్రాల షూటింగ్ లలో పాల్గొంటూనే , ప్రభుత్వం తరుపు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
Iran : రష్యా నుంచి నిరాశ.. చైనా వైపు మొగ్గుచూపిన ఇరాన్
హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ సాగుతోంది. తాజా షెడ్యూల్‌లో పవన్ కల్యాణ్ పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో చిత్ర బృందానికి సర్‌ప్రైజ్ ఇచ్చేలా మెగాస్టార్ చిరంజీవి (CHiranjeevi) సెట్స్‌కి విచ్చేశారు. పవన్ కల్యాణ్ పక్కన నిలుచున్న చిరంజీవి ఫొటో ఒకటి బయటకు వచ్చి, సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెగా అభిమానులు “మెగా బ్రదర్స్” అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
పవన్ కల్యాణ్ రియల్ లైఫ్‌లో జరిగిన ఓ సంఘటనను సినిమా సన్నివేశంగా మారుస్తున్నట్లు దర్శకుడు హరీష్ శంకర్ వెల్లడించారు. గతంలో పవన్ ఒక సందర్భంలో కారు పై కూర్చొని ప్రయాణించారు – ఇరువైపులా సెక్యూరిటీ, వెనుక బైకులపై అభిమానులు అల్లరి చేస్తూ వెళ్లిన దృశ్యం అప్పట్లో వైరల్ అయ్యింది. ఇదే సీన్‌ను “ఉస్తాద్ భగత్ సింగ్”లో రీ-క్రియేట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సీన్ థియేటర్లలో వస్తే పవన్ అభిమానుల నుంచి ఊహించని స్పందన రావడం ఖాయం.
Rajasingh : తెలంగాణ లో బిజెపి నాశనం చేసేది ఆ నాయకులే – రాజాసింగ్
ఇక గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ – హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పవన్ కల్యాణ్ ఇందులో పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అలాగే అశుతోష్ రాణా, చమ్మక్ చంద్ర, గౌతమి, నర్రా శ్రీను వంటి ప్రముఖులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మాస్, యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ మేళవించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో అలరించనుందని సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.