Site icon HashtagU Telugu

Chiranjeevi : మొన్న వెంకటేష్.. ఇప్పుడు చిరంజీవి.. ఆ విషయంలో అనిల్ రావిపూడి ప్లానింగ్ మాములుగా లేదుగా..

Chiranjeevi will Sing a Song in Anil Ravipudi Movie

Chiranjeevi Song

Chiranjeevi : అనిల్ రావిపూడి ఇటీవల సంక్రాంతికి వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాని తీసుకొచ్చి పెద్ద హిట్ కొట్టాడు. ఏకంగా 300 కోట్ల భారీ కలెక్షన్స్ రీజనల్ సినిమాకు తెప్పించడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఆ సినిమాకు అనిల్ రావిపూడి చేసిన ప్రమోషన్స్ చూసి టాలీవుడ్ సైతం షాక్ అయింది. సంక్రాంతికి వస్తున్నాం పెద్ద హిట్ అవ్వడంతో ఎన్నాళ్ళనుంచో ఎదురుచూస్తున్న మెగాస్టార్ సినిమా వెంటనే వచ్చేసింది.

సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజయి హిట్ అయిందో లేదో కాస్త గ్యాప్ కూడా లేకుండా అనిల్ రావిపూడి చిరంజీవి సినిమా మొదలుపెట్టేశాడు. చకచకా సినిమా కథ, స్క్రిప్ట్ పూర్తిచేసేసాడు. వెంటనే ఓపెనింగ్ కూడా చేసేసాడు. పనిలో పని ఓపెనింగ్ నుంచే తన స్టైల్ ప్రమోషన్స్ మొదలుపెట్టేశాడు. దీంతో ఈసారి చిరంజీవి ఫుల్ గా నవ్వించి పెద్ద హిట్ కొడతాడు అని అంతా అనిల్ రావిపూడి మీద నమ్మకం పెట్టుకున్నారు.

అయితే సినిమాకు మరింత హైప్ తేవడానికి అనిల్ రావిపూడి మరో ప్లాన్ వేసాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఎప్పుడూ పాట పాడని వెంకటేష్ తో సాంగ్ పాడించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. సినిమాకి వెంకటేష్ పాడటం కూడా కాస్తా హెల్ప్ అయింది. ఆ పాట ప్రమోషన్ ఇంకా వైరల్ అయింది.

ఇప్పుడు అదే పంథాని ఫాలో అవుతూ ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాట పాడించనున్నారు అని సమాచారం. ఆల్రెడీ భీమ్స్ మూడు పాటలకు ట్యూన్స్ పూర్తి చేసేసాడట. వాటిల్లో ఏదో ఒక ట్యూన్ కి అనిల్ చిరంజీవి తో సాంగ్ పాడించనున్నాడు. ఇదే నిజమైతే సినిమాపై హైప్ పెరగడమే కాదు సినిమా హాల్లో మెగా ఫ్యాన్స్ రచ్చ చేయాల్సిందే.

 

Also Read : Peddi : రామ్ చరణ్ పెద్ది ఆడియో రైట్స్ భారీ ధరకు.. పుష్ప 2 ని మించి..?