Site icon HashtagU Telugu

Chiranjeevi Trust: నేటితో చిరంజీవి ట్రస్టుకు 25 ఏళ్లు, మెగాస్టార్ ఎమోషనల్ మెసేజ్ !

Chiranjeevi knee surgery

Chiranjeevi knee surgery

Chiranjeevi Trust: 1998 అక్టోబర్ 2వ తేదీన హైదరాబాద్ లో ప్రారంభమైన ట్రస్టు (బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ ) నేటితో 25ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. ఈ సంస్థ ద్వారా ఎందరో ప్రజల జీవితాల్లో ద్వారా వెలుగులు నింపారు చిరంజీవి. ఈ సందర్భంగా తన సంతోషాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ‘భారతదేశానికి ముఖ్యమైన రోజు (అక్టోబర్ 2)న చిరంజీవి చారిటబుల్ ట్రస్టు ప్రారంభమై నేటికి 25 ఏళ్లు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందని సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేశారు మెగాస్టార్.

ఇన్నేళ్లలో 10లక్షలకు పైగా  రక్తం యూనిట్లతో ఎందరినో ఆదుకుని, 10వేల మందికి చూపు తెప్పించి, కరోనా సమయంలో ఎందరికో ఆక్సిజన్ అందించి ప్రాణాలు నిలిపి.. సాటి మనిషికి సేవ చేయడం ఎంతో అమూల్యమైనదని నిరూపించింది’.  ఇంతటి శక్తివంతంగా రూపుదిద్దుకోవడానికి సహకరించిన లక్షలాది మంది ఉన్నత మనస్కులైన సోదర, సోదరీమణులకు సెల్యూట్ చేస్తున్నాను అంటూ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు.

ఇది గొప్ప దేశానికి చేస్తున్న చిన్న సహకారం. మహాత్మునికి అర్పించే నివాళి’ అని వివరించారు. ఈ సందర్భంగా పలు ఫొటోలను పంచుకున్నారు చిరంజీవి. మెగాభిమానులు సైతం ఈ అద్భత ప్రయాణానికి సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల భోళా శంకర్ మూవీతో ఆకట్టుకున్న చిరంజీవి మరిన్ని సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాడు.

Also Read: Lal Salaam: రజనీ లాల్ సలాం రిలీజ్ కు రెడీ.. ముంబై డాన్ గా తలైవర్