Site icon HashtagU Telugu

Chiranjeevi- Srikanth Odela: మెగాస్టార్ చిరంజీవి- నాని- శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్‌లో మూవీ!

Chiranjeevi- Srikanth Odela

Chiranjeevi- Srikanth Odela

Chiranjeevi- Srikanth Odela: చిరంజీవి హీరోగా శ్రీకాంత్‌ ఓదెల (Chiranjeevi- Srikanth Odela) దర్శకత్వంలో ఓ చిత్రానికి రంగం సిద్ధమైంది. తాజాగా ఆ ప్రాజెక్ట్‌ను మెగాస్టార్ చిరంజీవి అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ మూవీకి మ‌రో ఆశ్చ‌ర్య‌కర‌మైన విష‌యం కూడా ఉంది. అదేంటంటే.. మెగాస్టార్‌- ఓదెల కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న మూవీకి సమర్పకుడిగా హీరో నేచుర‌ల్ స్టార్‌ నాని వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు. ‘‘హింసలోనే అతడు తన శాంతిని వెతుక్కున్నాడు’’ అంటూ పంచుకున్న పోస్టర్‌ ఆసక్తికరంగా ఉంది. ఆ పోస్ట‌ర్‌లో మెగాస్టార్ చిరంజీవి చేయి రక్తంతో కారుతున్న‌ట్లు క‌నిపిస్తోంది.

Also Read: Pushpa 2 : ఇక తగ్గేదేలే..’బాహుబలి-2′ రికార్డును బ్రేక్ చేసిన ‘పుష్ప-2’

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం విశ్వంభ‌ర మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. వాల్తేరు వీర‌య్య‌ బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత భోళా శంక‌ర్ మూవీతో వ‌చ్చిన మెగాస్టార్ ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకోలేక‌పోయారు. ఆ సినిమా భారీ డిజాస్ట‌ర్‌గా మారింది. ప్ర‌స్తుతం బింబిసార లాంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ మూవీని డైరెక్ట్ చేసిన వ‌శిష్ఠ‌తో మెగాస్టార్ ఓ భారీ మైథ‌లాజిక‌ల్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. దాదాపు రూ. 200 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ మూవీ తెర‌కెక్కుతున్న‌ట్లు స‌మాచారం. అయితే ఈ మూవీని ముందుగా సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 10న విడుద‌ల చేద్దామ‌నుకున్నారు. కానీ రామ్ చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్ మూవీ కూడా అదే స‌మయంలో రిలీజ్ ఉండ‌టంతో త‌న‌యుడు చ‌ర‌ణ్ కోసం చిరంజీవి త‌న సినిమాను వాయిదా వేసుకున్నారు. త్వ‌ర‌లోనే ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించ‌నున్నారు.

ఇక‌పోతే చిరు- శ్రీకాంత్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన మూవీ మాస్ బ్యాక్ డ్రాప్‌తో రానున్న‌ట్లు తెలుస్తోంది. శ్రీకాంత త‌న మొదటి సినిమాతోనే ప్రేక్ష‌కుల‌ను అల‌రించాడు. నేచుర‌ల్ స్టార్ నానితో తీసిన ద‌స‌రా మూవీతో తొలి మూవీతోనే రూ. 100 కోట్ల క్ల‌బ్‌లో చేరిన డైరెక్ట‌ర్‌గా నిలిచాడు. అయితే త‌న రెండో సినిమా కూడా నేచుర‌ల్ స్టార్ నానితోనే చేయ‌డం గ‌మ‌నార్హం. నాని- శ్రీకాంత్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న రెండో మూవీ టైటిల్ పేరు ప్యార‌డైజ్ అని తెలుస్తోంది. ఇక‌పోతే మెగాస్టార్ చిరంజీవి మూవీ నాని మూవీ అయిన వెంట‌నే ప‌ట్టాలెక్క‌నుంది. త్వ‌ర‌లోనే ఈ మూవీకి సంబంధించిన న‌టీన‌టుల‌ను ఎంపిక చేసి పూజ కార్య‌క్ర‌మం చేప‌ట్టనున్నారు.