Site icon HashtagU Telugu

Chiranjeevi : ఇంటిలో సంసారం కూడా చేసుకోనివ్వడం లేదు.. వారిపై చిరు కామెంట్స్..

Chiranjeevi Donate

Chiranjeevi Donate

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి నిన్న (మార్చి 31) జరిగిన ‘తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇదే ఈవెంట్ కి రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కూడా గెస్ట్ గా అటెండ్ అయ్యారు. ఇక ఈ ఈవెంట్ లో చిరంజీవి, విజయ్ తో కలిసి ఓ స్పెషల్ చిట్ చాట్ నిర్వహించి.. తన లైఫ్ లోని ఎన్నో విషయాలను అభిమానులకు తెలియజేసారు. ఇదే వేదిక చిరంజీవి సోషల్ మీడియా గురించి కూడా షాకింగ్ కామెంట్స్ చేసారు.

చిరంజీవి మాట్లాడుతూ.. “ప్రస్తుతం ప్రతి ఒక్కరి పై సోషల్ మీడియా బలమైన ప్రభావం చూపిస్తుంది. నాలాంటి స్టార్ ని కూడా దానికి ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యిపోయేలా చేస్తుంది. ఇటీవల ఫైనాన్సియల్ నెలాఖరులో మా ఆడిటర్స్ అంతా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. నేను అది వినకుండా సోషల్ మీడియాలో వచ్చే తమిళ్ విలేజ్ కుకింగ్ వీడియో చూస్తున్నాను. కేవలం అక్కడ మాత్రమే కాదు, సోషల్ మీడియా ఎంత ఇన్‌ఫ్లుయెన్స్ చూపిస్తుందంటే.. ఇంటిలో సంసారం కూడా చేసుకోనివ్వడం లేదు” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

Also read : Pooja Hegde : పూజా బేబీ లవర్ అతనేనా.. కారులో అడ్డంగా బుక్కైన అమ్మడు వీడియో వైరల్..!

ఇక ఇదే ఈవెంట్ లో చిరంజీవి తన మిడిల్ క్లాస్ మెంటాలిటీ గురించి కూడా చెప్పుకొచ్చారు. చిరంజీవి ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి మెగాస్టార్ గా ఎదిగారు. కానీ ఇప్పటికీ ఆయన ఆ మిడిల్ క్లాస్ మైండ్ సెట్ తోనే ఉన్నారట. షాంపు చివరికి వస్తే నీళ్లు పోసి వాడుకోవడం, అరిగిపోయిన సబ్బుని కొత్త సబ్బుకి అతికించి ఉపయోగించడం వంటివి ఇప్పటికీ చేస్తారంట.

అంతేకాదు ఇంటిలో అనవసరంగా వెలుగుతున్న లైట్స్, హీటర్ లాంటివి కూడా గమనిస్తూ.. వాటిని ఆఫ్ చేస్తూ వస్తుంటారట. ఇటీవల రామ్ చరణ్ బ్యాంకాక్ వెళ్తూ లైట్స్ అన్ని ఆన్ చేసి వెళ్లిపోయారట. చిరంజీవి వాటిని ఆఫ్ చేయాల్సి వచ్చిందట. చిరంజీవి నోటి నుంచి కూడా మిడిల్ క్లాస్ మెలోడీస్ వినిపించడంతో.. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.