Megastar Chiranjeevi : మెగా వారసుడొచ్చాడంటూ చిరంజీవి సంతోషం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులు కవల పిల్లలకు (Twins) తల్లిదండ్రులు కావడంతో మెగా కుటుంబంలో సంబరాలు అంబరాన్నంటాయి. ఎంతో కాలంగా మనవడు కోసం వేచి చూస్తున్న మెగాస్టార్ చిరంజీవికి ఈ వార్త అమితానందాన్ని ఇచ్చింది

Published By: HashtagU Telugu Desk
Chiru Happy

Chiru Happy

Megastar Chiranjeevi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులు కవల పిల్లలకు (Twins) తల్లిదండ్రులు కావడంతో మెగా కుటుంబంలో సంబరాలు అంబరాన్నంటాయి. ఎంతో కాలంగా మనవడు కోసం వేచి చూస్తున్న మెగాస్టార్ చిరంజీవికి ఈ వార్త అమితానందాన్ని ఇచ్చింది. అపోలో ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిరంజీవి తన సంతోషాన్ని పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తమ ఇంట్లోకి ఇద్దరు వారసులు రావడం మాటల్లో చెప్పలేని అనుభూతిని ఇస్తోందని, తల్లి ఉపాసనతో పాటు ఇద్దరు బిడ్డలు కూడా క్షేమంగా, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని ఆయన వెల్లడించారు.

ఈ శుభ సందర్భంలో చిరంజీవి వైద్య బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తమ కుటుంబాన్ని దశాబ్దాలుగా ఆదరిస్తున్న అభిమానుల దీవెనల వల్లే ఈరోజు తమ ఇంట్లో ఈ అద్భుతం జరిగిందని ఆయన పేర్కొన్నారు. “మా ఇంట్లో ఈ శుభం జరగాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం, ఈ రోజు అది సాకారమైంది” అంటూ ఆనంద బాష్పాలతో ఆయన మాట్లాడిన తీరు మెగా అభిమానులను కదిలించింది. మెగా వారసుల రాకతో సోషల్ మీడియా వేదికగా ‘మెగా ప్రిన్సెస్ & ప్రిన్స్’ అంటూ ట్రెండింగ్ మొదలైంది.

తారక్ ట్వీట్ వైరల్

మెగా వారసుల రాకపై చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా స్పందిస్తూ రామ్ చరణ్ దంపతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. “రామ్ చరణ్, ఉపాసనలకు కవలలు జన్మించినందుకు అభినందనలు. మీ కుటుంబం ఎల్లప్పుడూ ప్రేమ, ఆనందంతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను” అని తారక్ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఆర్ఆర్ఆర్ హీరోల మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ సందేశం మరోసారి చాటిచెప్పింది.

  Last Updated: 01 Feb 2026, 02:19 PM IST