Site icon HashtagU Telugu

Chiranjeevi : ఆటో రామ్‌ప్రసాద్ గృహప్రవేశానికి.. చిరంజీవి ఏం బహుమతి పంపించారో తెలుసా..!

Chiranjeevi Sends Special Gift to Auto Ram Prasad House Worming Ceremony

Chiranjeevi Sends Special Gift to Auto Ram Prasad House Worming Ceremony

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి వ్యక్తిత్వం గురించి తెలుగు ఆడియన్స్ కి సపరేట్ గా చెప్పనవసరం లేదు. ఆయనని విమర్శించిన వారిని కూడా తన ఇంటిలోకి ఆహ్వానం పలికి, గౌరవించే మనస్తత్వం చిరంజీవిది. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి.. చిన్న యాక్టర్ నుంచి పెద్ద యాక్టర్ వరకు ప్రతి ఒక్కర్ని సమానంగా చూస్తుంటారు. పెద్ద స్టార్ ఇమేజ్ ఉన్న నటుడికి ఇచ్చే గౌరవాన్నే.. చిన్న నటుడికి కూడా ఇస్తూ తన గొప్ప మనసుని చాటుకుంటుంటారు.

ఈ క్రమంలోనే జబర్దస్త్(Jabardasth) నటుడు ఆటో రామ్ ప్రసాద్(Auto Ram Prasad) పట్ల కూడా చిరంజీవి వ్యవహరించారు. గతంలో ఆటో రామ్‌ప్రసాద్ గృహప్రవేశానికి చిరంజీవి ఓ బహుమతి పంపించి ఆశ్చర్యపరిచారు. ఈ విషయాన్ని రామ్ ప్రసాద్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. రామ్‌ప్రసాద్ తన కొత్త ఇంటి గృహప్రవేశం సమయంలో చిరంజీవి పీఏకి ఫోన్ చేసి.. “సార్ మా ఇంటి గృహప్రవేశం ఉంది. చిరంజీవి గారికి ఆహ్వాన పత్రిక ఇచ్చి అశీసులు తీసుకోవాలని అనుకుంటున్నాను. ఆయన గృహప్రవేశానికి రాకపోయినా పర్వాలేదు. ఒకసారి మీట్ చేయించండి” అని చెప్పారంట.

ఫోన్ కట్ చేసిన గంటలో చిరంజీవి పీఏ నుంచి రిటర్న్ కాల్ వచ్చింది. “చిరంజీవి గారు రేపు మార్నింగ్ మిమ్మల్ని రమ్మన్నారు” అని చెప్పాడట. ఇక ఆరోజు నైట్ రామ్ ప్రసాద్ కుటుంబం పడుకోలేదట. ఉదయం ఎప్పుడు అవుతుంది, చిరంజీవి ఇంటికి ఎప్పుడు వెళ్తామని ఎదురు చూశారట. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ చిరు ఇంటికి వెళ్లి కార్డు ఇచ్చి అశీసులు తీసుకున్నారట. అయితే గృహప్రవేశానికి రాలేను అని చిరంజీవి చెప్పారట. దానికి రామ్ ప్రసాద్ పర్వాలేదు సార్ అని చెప్పి ఇంటికి వెళ్లిపోయారు.

ఆ తరువాత గృహప్రవేశం నాడు పూజలో ఉన్న సమయంలో చిరంజీవి ఇంటి నుంచి ఒక బహుమతి వచ్చిందట. ఆ బహుమతి ఏంటంటే.. రామ్ ప్రసాద్ దంపతులకు పట్టువస్త్రాలు పంపించారు. చిరంజీవి గుర్తుపెట్టుకొని మరి పంపించిన ఆ వస్త్రాలను ఉపయోగించకుండా.. రామ్ ప్రసాద్ భద్రంగా దాచుకున్నారట.

 

Also Read : DJ Tillu 2 : ఎన్టీఆర్ ఇంట్లో టిల్లు 2 సక్సెస్ సంబరాలు