Site icon HashtagU Telugu

Chiranjeevi: చిరంజీవి మొదట నిద్ర లేవగానే ఎవరి ఫోటో చూస్తారో తెలుసా?

Chiranjeevi

Chiranjeevi

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి మనందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ వరుసగా అవకాశాలను అందుకుంటా దూసుకుపోతున్నారు చిరంజీవి. ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో చిరంజీవికి సంబంధించిన ఒక రహస్య విషయం బయటపడింది.

We’re now on WhatsApp. Click to Join

దీంతో ఆ విషయం గురించి సోషల్ మీడియాలో అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇంతకీ అదేమిటంటే.. చిరంజీవి తన జర్నీతో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. ఆయనలా ఎదగాలని ఆయన ఫోటోని నిత్యం చూస్తూ ఎంతోమంది స్ఫూర్తి పొందుతుంటారు. మరి చిరంజీవి రోజు ఎవర్ని చూస్తూ స్ఫూర్తి పొందుతుంటారో తెలుసా? ఈ రహస్య విషయం రీసెంట్ ఈవెంట్ లో బయటకి వచ్చింది.

Also Read: Supritha: రాత్రివేళ పబ్బులో అలాంటి పనులు చేస్తున్న సుప్రీత.. చూస్తుండగానే అలా?

తాజాగా హైదరాబాద్ లో మహానటి సావిత్రి క్లాసిక్స్ బుక్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కి చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొని బుక్ ని లాంచ్ చేసారు. ఇక ఈ ఈవెంట్ లో సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి మాట్లాడుతూ..

 

చిరంజీవిని మొదటిసారి కలుసుకున్న సందర్భంలో జరిగిన విషయాన్ని అందరితో పంచుకున్నారు. విజయ చాముండేశ్వరి చిరు ఇంటికి వెళ్ళినప్పుడు.. చిరంజీవి కాలికి గాయం అయ్యి ఉందట. అయినా సరే ఆమె వచ్చిందని తెలుసుకున్న చిరంజీవి.. పైన రూమ్ లో నుంచి కర్ర సహాయంతో క్రిందకి వచ్చారట. ఇక వచ్చిన తరువాత విజయ చాముండేశ్వరికి ఎంతో మర్యాధ చేశారట. అలాగే ఆమెతో మాట్లాడుతూ.. నేను రోజు ఉదయం లేవగానే సావిత్రమ్మ ఫోటోనే చూస్తాను. నా బెడ్ ఎదురుగా అమ్మ ఫోటోనే ఉంటుంది.అని చెప్పారట. మళ్ళీ ఆమె నమ్ముతారో లేదో అని సందేహం కలిగి.. పైకి వెళ్లి ఆ ఫోటోని తీసుకువచ్చి విజయ చాముండేశ్వరికి చూపించారట. చిరంజీవి విషయంలో తనకి నచ్చింది ఇదే అని విజయ చాముండేశ్వరి చెప్పుకొచ్చారు. కొందరు చెప్పేది ఒకటి ఉంటుంది, చేసింది ఒకటి ఉంటుంది. కానీ చిరంజీవి విషయంలో.. ఆలోచన, మాట, ఆచరణ మూడు ఒకటే ఉంటాయని విజయ చాముండేశ్వరి చెప్పుకొచ్చారు. అందుకనే సావిత్రి క్లాసిక్స్ బుక్ ని చిరునే లాంచ్ చేయాలని భావించి.. ఆయన చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని జరిపించినట్లు చెప్పుకొచ్చారు.

Also Read: Pallavi Prashanth: రైతు బిడ్డ ముసుగులో అలాంటి పనులు చేస్తున్న పల్లవి ప్రశాంత్.. బయటపడ్డ మోసం?