Site icon HashtagU Telugu

Kokapet Lands : క్లిన్ కార పేరు బలం..అప్పుడే చిరంజీవి ఫ్యామిలీకి 2000 కోట్ల లాభం

chiranjeevi profit increase

chiranjeevi profit increase

రీసెంట్ గా మెగా ఫ్యామిలీలో మరో బుజ్జి అమ్మాయి వచ్చిన సంగతి తెలిసిందే. చరణ్ – ఉపాసన దంపతులకు పండంటి ఆడబిడ్డ పుట్టింది. వివాహమైన 11 ఏళ్ల తర్వాత అమ్మాయి పుట్టడం తో చిరు ఫ్యామిలీ సంబరాలు అంబరాన్ని తాకాయి. ముద్దుల మానవరాలుకు చిరు క్లీంకార (Klin Kaara) అనే నామకరణం చేశారు. ఈ పేరు ప్రకటన తర్వాత సోషల్ మీడియాలో మిశ్రమ అభిప్రాయాలు వచ్చాయి. కానీ చిరంజీవి (Chiranjeevi) మాత్రం అమ్మవారి శక్తి రూపానికి ఇది మ‌రో పేరు అన్నారు. ‘‘క్లీం అనే బీజాక్షర స్వరూపిణియైన అమ్మవారికి నమస్కారం. నిరంతరం మానవులకి మానసికంగాను శారీరకంగాను ఉన్న కొన్ని రకాల కోరికలను తీర్చే మాతృస్వరూపిణికి నమస్కారం’’ అని దీని అర్థం. దుష్టాన్నము, విషాన్నము మానవుడి శరీరం అంతా పాడుచేసి తీవ్రమైన అనారోగ్యానికి గురి చేస్తుంది. దీని నుంచి మాన‌వుడిని బయటపడవేసే అపూర్వమైన మంత్రం ఇది. ఈ గుణాలను పోగుచేసుకొని తన మనవరాలు ఎదగాలని కోరుకుంటున్నాని , మనవరాలు రాకతో తమ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని అప్పట్లో చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు.

చిరంజీవి అన్న ఆ మాటలు ఇప్పుడు నిజం అయ్యాయి. పాప పుట్టి మూడు నెలలు కాలేదు అప్పుడే చిరంజీవి ఫ్యామిలీ కి 2000 కోట్లు వచ్చిపడ్డాయి. అదేలా అనుకుంటున్నారా..? కోకాపేట భూముల (Kokapet lands) వల్ల. ప్రస్తుతం కోకాపేట భూముల గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు. కోకాపేట నియోపోలీస్‌ భూములను ప్రభుత్వం వేలం వేయగా..కోట్ల రూపాయిలు పలికాయి. ప్లాట్‌ నెం.10లో 3.6 ఎకరాల భూమిని ప్రభుత్వం వేలం వేసింది. అక్కడ ఎకరాకు అత్యధికంగా రూ.100 కోట్లకుపైనే వేలం పలికింది. దీంతో దేశం మొత్తం ఒక్కసారిగా కోకాపేట వైపు చూడడం మొదలుపెట్టింది.

మరోపక్క చిరంజీవి పేరు కూడా అలాగే వినిపిస్తుంది. ఎందుకంటే కోకాపేట లో చిరంజీవి కి 20 ఎకరాల భూమి ఉంది. ఎప్పుడో దశాబ్దం క్రితం అతి తక్కువ ధరకే ఆ భూములను చిరంజీవి కొనుగోలు చేసారు. వ్యవసాయం చేయడం కోసం అక్కడ భూమిని కొన్నారు. ఐతే అక్కడ వ్యవసాయం చేసే పరిస్థితులు లేకపోవడంతో ఆ భూములను అలాగే వదిలేశారు. రీసెంట్ గా చిరంజీవి నటించిన ఆచార్య సినిమాకు సంబంధించిన సెట్స్ కూడా అక్కడే వేసి షాట్ చేశారు. ఈ ప్లేస్ లోనే మెగా స్టూడియో కట్టాలనే ఆలోచనలో కూడా చిరు ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు అవి ఎకరా వంద కోట్లు పలకడం తో చిరు 20 ఎకరాలకు 2000 వేల కోట్లు వచ్చినట్లే అంటున్నారు. ఇదంతా చిరంజీవి ముందుచూపు కు ఒక ఉదాహరణ అని కొంతమంది మాట్లాడుకుంటుంటే..మరికొంతమంది మాత్రం మనవరాలు అడుగుపెట్టిన వేళ విశేషం అంటున్నారు. ఏది ఏమైనప్పటికి భూమి మీద పెట్టిన డబ్బు ఎప్పుడు అన్యాయం చేయదని మరోసారి అంత మాట్లాడుకుంటున్నారు.

Read Also : WOLF Teaser : అనసూయ తాంత్రిక విద్య నేర్చుకుందా..? చూస్తే అలాగే అనిపిస్తుంది