Site icon HashtagU Telugu

Chiranjeevi : ఆ సినిమా చేయొద్దని పరుచూరి చెప్పినా.. చిరు వినకుండా చేసి ప్లాప్ అందుకున్నారు..

Chiranjeevi Not Listening Paruchuri Brothers at Shankar Dada Zindabad Movie Time

Chiranjeevi Not Listening Paruchuri Brothers at Shankar Dada Zindabad Movie Time

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) మాస్ కమర్షియల్ సినిమాలతో పాటు తనలోని నటుడిని చూపించేందుకు అప్పుడప్పుడు కొన్ని ఆర్ట్ ఫిలిమ్స్ లో కూడా చేశారు. అయితే అభిమానులకు చిరంజీవి అంటే గుర్తుకు వచ్చేది.. మాస్ డైలాగ్స్, డాన్స్‌లు, ఫైట్స్. వీటిలో ఏది తక్కువైనా అభిమానులు ఒప్పుకోరు. ఆ సినిమా కోసం చిరంజీవి ప్రాణం పెట్టి పని చేసినా.. దానిని పట్టించుకోకుండా బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ చేస్తారు. అలా ప్లాప్ చేసిన ఓ సినిమా ‘శంకర్ దాదా జిందాబాద్'(Shankar Zindabad).

2005లో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘శంకర్ దాదా ఎంఎంబిఎస్’ సూపర్ హిట్టుగా నిలిచింది. బాలీవుడ్ చిత్రం ‘మున్నా భాయ్ ఎంఎంఎబిఎస్’కి రీమేక్ గా తెరకెక్కించిన ఈ చిత్రంలో.. చిరంజీవి తన మార్క్ కామెడీ అండ్ కొన్ని యాక్షన్ సీక్వెన్స్ తో ఆడియన్స్ ని బాగా అలరించారు. ఇక 2007లో ఈ చిత్రానికి సీక్వెల్‌గా, హిందీ మూవీ ‘మున్నా భాయ్ జిందాబాద్’కి రీమేక్ తెరకెక్కిన శంకర్ దాదా జిందాబాద్.. ‘గాంధీగిరి’ అంటూ అహింస అనే పాయింట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చారు.

ఈ సినిమాలో మాస్ హీరో ఇమేజ్ ఉన్న చిరంజీవితో.. శాంతి వచనాలు చెప్పించడమే కాకుండా, చిరంజీవిని ఒక మానసిక రోగిగా చూపించారు. ఈ పాయింట్ అభిమానులతో పాటు జనరల్ ఆడియన్స్ కి కూడా నచ్చలేదు. దీంతో ఆ చిత్రాన్ని బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ చేశారు. అయితే ఈ సినిమా చేయొద్దని చిరంజీవికి ముందుగానే పరుచూరి గోపాలకృష్ణ సలహా ఇచ్చారట. పరుచూరి బ్రదర్స్(Paruchuri Brothers) ఈ సినిమాకి డైలాగ్ రైటర్స్ గా పనిచేసారు.

మూవీ స్టార్టింగ్ సమయంలోనే పరుచూరి గోపాలకృష్ణ.. చిరంజీవితో ఈ సినిమా వద్దని చెప్పారట. మీ బాడీ లాంగ్వేజ్ కి ఈ కథ సెట్ అవ్వదని, మాస్ డైలాగ్స్ చెప్పే మీరు శాంతి వచనాలు చెబుతుంటే ఆడియన్స్ అంగీకరించలేరని చెప్పారట. కానీ చిరంజీవి వినకుండా సినిమా చేశారట. ఈ చిత్రాన్ని ప్రముఖ డాన్స్ మాస్టర్ ప్రభుదేవా డైరెక్ట్ చేశారు.

 

 

Also Read : Devara Movie: ఎన్టీఆర్ ‘దేవర’ వాయిదా.. కార‌ణం అదేనా..?