Chiranjeevi New Projects : మెగాస్టార్ బర్త్ డే సందర్బంగా..మెగా ప్రాజెక్ట్ ల ప్రకటన

నేడు తన పుట్టిన రోజు సందర్బంగా తన కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించారు

Published By: HashtagU Telugu Desk
Chiranjeevi New Projects Announced

Chiranjeevi New Projects Announced

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు (Chiranjeevi Birthday )సందర్బంగా చిరంజీవి కొత్త ప్రాజెక్ట్ (Chiranjeevi New Projects Announced ) లను ప్రకటించి అభిమానుల్లో సంబరాలు నింపారు మేకర్స్. చిరంజీవి నేడు 68 వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. తనకు 68 ఏళ్లు వచ్చినప్పటికీ..ఏమాత్రం ఆయనలో జోష్ తగ్గలేదు. యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలు చేస్తున్నాడు. అలాగే డాన్సులు , ఫైట్స్ , కామెడీ , ఎమోషన్స్ ఇలా అన్ని కోణాలను చూపిస్తూ ప్రేక్షకులను , అభిమానులను అలరిస్తూ వస్తున్నాడు.

తాజాగా నేడు తన పుట్టిన రోజు సందర్బంగా తన కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించారు. రీసెంట్ గా భోళా శంకర్ (Bhola Shankar) తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరు..తన 156వ (Chiranjeevi 156 Movie) సినిమాను తన కూతురు సుస్మిత కొణిదెలకు చెందిన గోల్డెన్ బాక్స్​ ఎంటర్​టైన్మెంట్స్​లో చేస్తున్నాడు. ఈ విషయాన్నీ నేడు అధికారిక ప్రకటన చేస్తూ ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో 4 దశాబ్దాలుగా వెండితెరను ఏలుతున్న లెగసీ, లక్షలాది మందికి భావోద్వేగాలను కలిగించే వ్యక్తిత్వం, తెర ముందూ, తెరవెనకా ఒకేలా పిలవబడే వ్యక్తి.. అంటూ చిరు గొప్పతన్నాన్ని రాసుకొచ్చారు. ఓ డస్క్రీ కలర్​లో ఉన్న కొత్త పోస్టర్​ను రిలీజ్ చేశారు. ఇందులో చిరంజీవి తన మీసాలను పదునుగా చేస్తూ చురకత్తులాంటి చూపులతో గంభీరంగా చూస్తూ కనిపించారు. ఇంకా ఈ పోస్టర్​ బ్యాక్​గ్రౌండ్​లో ఆయన నటించిన గత సినిమాల పేర్లన్నీ కనిపించడం విశేషం. మరి ఈ చిత్రాన్ని ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు..కాస్ట్ & క్రూ ఏంటి వివరాలు తెలియాల్సి ఉంది.

అలాగే చిరంజీవి 157 (Chiranjeevi 157 Movie) వ చిత్రాన్ని కూడా ప్రకటించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో బింబిసారా ఫేమ్ వశిష్ఠ (Malladi Vassishta) డైరెక్షన్లో ఈ మూవీ తెరకెక్కబోతుంది. ఈ మూవీ నుంచి ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే ఈ చిత్రం కూడా పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కనుందని అర్ధమవుతుంది. ఒక స్టార్ సింబల్ తో ఈ పోస్టర్ ను డిజైన్ చేశారు. అలాగే ఆ స్టార్ లో పంచభూతాలైన.. నీరు, నిప్పు, గాలి, భూమి, ఆకాశంను చూపించారు. ఈ పంచభూతాల శక్తి మెగాస్టార్ అంటూ ఈ పోస్టర్ ను సోషల్ మీడియాలో పంచుకున్నారు మేకర్స్. దాంతో ఈ మూవీ ఫై అంచనాలు పెరిగిపోయాయి. త్వరలోనే ఈ కు సంబంధించిన వివరాలు తెలుపనున్నారు. మొత్తం మీద చిరు బర్త్ డే సందర్బంగా రెండు మెగా ప్రాజెక్ట్స్ వచ్చి అభిమానులను సంతోష పెట్టాయి.

Read Also : Rashmika-Vijay: రష్మిక తో మళ్లీ నటించాలనుంది: విజయ్ దేవరకొండ

  Last Updated: 22 Aug 2023, 12:06 PM IST