Site icon HashtagU Telugu

Chiranjeevi : చిరంజీవి న్యూ లుక్ కేక

Chiranjeevi New Look

Chiranjeevi New Look

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) రోజు రోజుకు యువకుడిలా మారుతున్నాడు. ప్రస్తుతం 68 ఏళ్ల వయసు ఉన్న చిరు..ఇంకా 25 ఏళ్ల కుర్రాడిలా ఫుల్ యాంగ్ గా కనిపిస్తున్నాడు. యంగ్ హీరోలు చాలామంది సినిమా ..సినిమా కు కాస్త గ్యాప్ తీసుకుంటూ..ఫిజిక్ విషయంలో పెద్దగా ఇంట్రస్ట్ చూపించకుండా ఉంటే..చిరంజీవి మాత్రం ఇంకా వరుస సినిమాలు చేస్తూ..ఓ సినిమా సెట్స్ ఫై ఉండగానే మరో సినిమాను లైన్ లో పెడుతూ ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా అలాగే..ఫిజిక్ విషయంలో కూడా ఏమాత్రం అశ్రద్ధ చూపించకుండా వెళ్తుండడం అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది. రీసెంట్ గా భోళాశంకర్ మూవీ లో కాస్త లావు అనిపించినా చిరు..తాజాగా మరింత సన్నగా మరి అభిమానులకు షాక్ ఇచ్చాడు.

ప్రముఖ రచయిత సత్యానంద్ (Writer Satyanand)..చిత్రసీమలో అడుగుపెట్టి నేటికీ 50 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు గాను ఆయన్ను చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. ఈ మేరకు ఆయన్ని కలిసి సత్కరించి ఆ ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేయగా..ఆ పిక్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఈ పిక్స్ లో చిరంజీవి సన్నగా కనిపించేసరికి ఫాన్స్ ఆశ్చర్య పోతు న్యూ లుక్ కేక అంటూ కామెంట్స్ వేస్తున్నారు. చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. మెహర్ రమేష్ డైరెక్షన్లో వచ్చిన భోళాశంకర్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ కాగా.. ప్రస్తుతం ఆయన ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ఠ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా కోసమే చిరు లుక్‌ మార్చుకుని ఉంటారని నెటిజన్లు భావిస్తున్నారు.

Read Also : CM KCR: సింగరేణి కార్మికులకు కేసీఆర్ గుడ్ న్యూస్

Exit mobile version