Site icon HashtagU Telugu

#Mega157 : చిరు చిత్రంలో ఆ సాంగ్ హైలైట్ గా ఉండబోతుందట

Chiru Nayan Song

Chiru Nayan Song

బ్లాక్‌బస్టర్ హిట్లతో దూసుకెళ్తున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi)కి మరో గోల్డెన్ అవకాశంగా మెగాస్టార్ చిరంజీవి(CHiranjeevi)తో సినిమా చేసే ఛాన్స్ దక్కింది. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉండగా, ఇందులో లేడీ సూపర్‌స్టార్ నయనతార (Nayanatara) కథానాయికగా నటిస్తున్నారు. చిరంజీవి-నయనతార కాంబినేషన్‌కి ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ ఉండటంతో, దర్శకుడు అనిల్ వారితో ఓ ప్రత్యేక పాటను ప్లాన్ చేశారని సమాచారం. ఈ పాట సినిమాకు హైలైట్‌గా నిలవబోతుందంటూ టాలీవుడ్ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.

Janasena : వైసీపీ కోటలు బద్దలు కొట్టే వ్యూహంతో పవన్

సాధారణంగా అనిల్ రావిపూడి సినిమాల్లో ఎంటర్టైనింగ్ సాంగ్స్ కీలకంగా ఉంటాయి. అయితే ఈ సినిమాలో పాటల సంఖ్య తక్కువగా ఉంటాయని, కానీ చిరంజీవి-నయనతారలపై చిత్రీకరించే ప్రత్యేక సాంగ్ మాత్రం ప్రేక్షకులకి ప్రత్యేక ఆకర్షణగా ఉండనుందని చెపుతున్నారు. చిరంజీవి గతంలోనే నయనతారతో స్క్రీన్ షేర్ చేసుకోవాలన్న ఆసక్తిని వ్యక్తం చేయగా, ఇప్పుడు ఆ కల నిజమవుతుంది. మెగాస్టార్ అభిమానుల కోసం ఈ రొమాంటిక్ సాంగ్‌కి ప్రత్యేక కోణం ఇవ్వబోతున్నట్లు సినీ వర్గాలు అంటున్నాయి.

ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా భీమ్స్ సిసిరోలియో పని చేస్తున్నారు. ఇప్పటికే పలు హిట్ ఆల్బమ్‌లను అందించిన ఆయన, ఈ చిత్రంలోని పాటలపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్ త్వరలోనే జరగనుందని సమాచారం. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సహూ గారపాటి నిర్మిస్తున్నారు. మెగాస్టార్ కెరీర్‌లో మరో కమర్షియల్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా నిలువబోతుందని మెగా అభిమానుల్లో భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు.