Site icon HashtagU Telugu

Chiranjeevi : ఈ వయసులో అంత కష్టం అవసరమా చిరంజీవి..?

Chiru-Viswambhara

Chiru

చిరంజీవి (Chiranjeevi )..ఈ పేరు చెపితే మెగా అభిమానుల్లో ఎక్కడిలేని సంతోషం..ఒక సామాన్య మధ్య తరగతి నుంచి వచ్చి తెలుగు సినీ రంగంలో తన కంటూ ఓ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. స్వయంకృషి, స్వీయప్రతిభే చిరు కెరీర్ కు పునాదిరాళ్లుగా ఉపయోగపడ్డాయి. అడుగడుగునా సవాళ్లను అధిగమించి చరిత్ర సృష్టించిన విజేత.బాక్సాఫీసు రికార్డులు సృష్టించిన మగధీరుడు. ఆశేష అభిమానులకు మెగాస్టార్ చిరంజీవిగా అభిమానుల గుండెల్లో కొలువైనాడు. స్టార్ ఇమేజ్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసిన కథానాయకుడు చిరంజీవి. నటుడిగా 150పైగా చిత్రాలు చేసారు. అంతేకాదు సినీ కెరీర్ పీక్స్‌లో ఉండగానే..రాజకీయబాట పట్టాడు.ఎమ్మెల్యే అయ్యాడు. ఆపై రాజ్యసభ సభ్యుడు అయ్యారు. ఆపై కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం పాలిటిక్స్‌ను ఒదలిపెట్టి సినిమాలే లోకంగా బతుకున్నాడు.

We’re now on WhatsApp. Click to Join.

టాలీవుడ్ లో ఎన్టీఆర్,ఏఎన్నార్, కృష్ణ,కృష్ణంరాజు, శోభన్ బాబు వంటి స్టార్ హీరోల తర్వాత ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా మెగాస్టార్ గా ఎదిగిన వ్యక్తి చిరంజీవి. చిరు జీవితం వడ్డించిన విస్తరి కాదు. మొదట్లో ఎన్నో ఒడిదుడికులు..మరెన్నో విమర్శలు..ఆ తర్వాత ఆయన సినీ పరిశ్రమలో వచ్చిన ఒక్కోఅవకాశాన్ని వైకుంఠపాళి అనే సినీ పరిశ్రమలో పాము నోటికి చిక్కకుండా జాగ్రత్తగా నిచ్చెనలు ఎక్కి టాలీవుడ్ లో మెగాస్టార్ గా ఎదిగాడు. అలాంటి మెగాస్టార్ సమాజం కోసం ఎన్నో సేవలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం చేత పద్మవిభూషణ్ అనిపించుకున్నాడు. అలాంటి చిరంజీవి..ఇప్పటికి ఎంతో కష్టపడడం మెగా అభిమానుల్లో సంతోషం తో పాటు ఆందోళన కలిగిస్తుంది.

ప్రస్తుతం చిరంజీవి వయసు 68 ..అయినప్పటికీ 25 ఏళ్ల కుర్రాడిలా కష్టపడుతూ..యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నాడు. వరుస పెట్టి సినిమాలు చేస్తూ..క్షణం తీరక లేకుండా గడుపుతున్నాడు. ప్రస్తుతం ఈయన బింబిసార డైరెక్టర్ వశిష్ఠ డైరెక్షన్లో విశ్వంభర (Viswambhara ) అనే సోషయో ఫాంటసీ సినిమా చేయబోతున్నాడు. దీని కోసం ఎంతగానో కష్టపడుతున్నాడు. ట్రైనర్ సమక్షంలో జిమ్ లో కసరత్తులు చేస్తోన్న వీడియోను ఆయన సోషల్ మీడియా లో షేర్ చేశారు. ఈ వయసులోనూ ఆయన డెడికేషన్ సూపర్ అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తూనే..ఇంత కష్టపడడం అవసరమా అన్న అని అంటున్నారు. ఏది ఏమైనప్పటికి సినిమా కోసం చిరు ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధం అని మరోసారి నిరూపితం అయ్యింది.

Read Also : Mrunal Thakur : ఫ్యామిలీ స్టార్ లో మృణాల్ ఆ టాలెంట్ చూపించబోతుందా..?