Site icon HashtagU Telugu

Chiranjeevi : చంద్రబాబుతో చిరంజీవి సమావేశం.. పిఠాపురం ప్రచారానికి..!

Chiranjeevi Is Scheduling To Meet Tdp President Chandrababu Naidu

Chiranjeevi Is Scheduling To Meet Tdp President Chandrababu Naidu

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం వెళ్లి ప్రచారం చేయనున్నారని గత కొన్ని రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా కాంపెయిన్ ద్వారా చిరంజీవి ఇప్పటికే పలువురు జనసేన నాయకులకు, కూటమి అభ్యర్థులకు మద్దతు తెలుపుతూ వచ్చారు. జనసేన నాయకులను గెలిపించాలంటూ పవన్ కోసం చిరంజీవి కూడా బాగానే ప్రచారం చేస్తున్నారు. ఇక ఫైనల్ టచ్ గా పవన్ పోటీ చేస్తున్న పిఠాపురంకి డైరెక్ట్ గా వెళ్లి ప్రచారం చేయనున్నారని టాక్ వినిపిస్తుంది.

ఇక ఈ విషయం గురించి తాజాగా వినిపిస్తున్న వార్తలు ఏంటంటే.. మే 10న రాత్రి చిరంజీవి విజయవాడ వెళ్ళబోతున్నారట. ఆ నెక్స్ట్ డే 11వ తారీఖున టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో సమావేశం కానున్నారట. చంద్రబాబుతో ఎన్నికలు ప్రచారం గురించి చర్చిన తరువాత.. అదే రోజు నారా రోహిత్ నటించిన ప్రతినిధి 2 సినిమాని చిరంజీవి విజయవాడలో చూడనున్నారట. అలాగే పిఠాపురం వెళ్ళడానికి కూడా చిరంజీవి ప్లాన్ చేస్తున్నారట. అయితే దాని పై ఇంకా క్లారిటీ లేదు. మరి ఫైనల్ గా ఏమవుతుందో చూడాలి.

కాగా పవన్ కోసం ఇప్పటికే దాదాపు మెగా ఫ్యామిలీ అంతా రంగంలోకి దిగి పని చేస్తున్నారు. నాగబాబు మరియు ఆయన సతీమణితో పిఠాపురం వీధుల్లో పవన్ కోసం ప్రచారం చేస్తూ కష్టపడుతున్నారు. అలాగే మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయి దుర్గ తేజ్, వైష్ణవ్ తేజ్ కూడా పలు నియోజిక వర్గాల్లో పవన్ కోసం, కూటమి అభ్యర్థులు కోసం ప్రచారం చేస్తూ సందడి చేస్తున్నారు. వీరితో పాటు సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్, జానీ మాస్టర్ తదితర స్టార్ కాంపెయినర్స్ కూడా ప్రచారం చేస్తూ జనసేన కోసం పటు పడుతున్నారు.

Also read : Indian 2 – Game Changer : ఇండియన్ 2లో గేమ్ ఛేంజర్.. కిక్ ఇస్తున్న శంకర్ నయా ప్లాన్..