Chiranjeevi : పిఠాపురం ప్రచారానికి చిరంజీవి నిజంగా రాబోతున్నారా..? నాగబాబు ఏమన్నారు..!

పిఠాపురం ప్రచారానికి చిరంజీవి నిజంగా రాబోతున్నారా..? ఈ విషయం పై నాగబాబు చెప్పిన మాటలు ఏంటంటే..

Published By: HashtagU Telugu Desk
Chiranjeevi Is Really Campaign In Pithapuram For Pawan Kalyan

Chiranjeevi Is Really Campaign In Pithapuram For Pawan Kalyan

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రాజకీయ జీవితానికి గుడ్ బై చెప్పేసి, సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత నుంచి పాలిటిక్స్ గురించి ఒక మాట కూడా మాట్లాడకుండా వచ్చారు. తన తమ్ముళ్లు రాజకీయాల్లో పోరాడుతున్న సరే.. తాను మాత్రం పాలిటిక్స్ గురించి ఎటువంటి కామెంట్స్ చేయకుండా వచ్చారు. కానీ ఈసారి ఎన్నికల్లో మాత్రం చిరు తన వైఖరిని మార్చారు. పాలిటిక్స్ గురించి డైరెక్ట్ గా మాట్లాడుతూ ఏపీ రాజకీయాల్లో వేడిని పెంచుతున్నారు.

ఇటీవల జనసేన ప్రచార ఖర్చులు కోసం చిరంజీవి.. ఐదు కోట్ల విరాళాన్ని పవన్ కళ్యాణ్ కి అందించారు. ఆ తరువాత జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్‌ని, కూటమి అభ్యర్థి సీఎం రమేష్‌ని గెలిపించాలంటూ.. ఏపీ ప్రజలకు ఒక వీడియో సందేశం పంపించారు. ఇక ఈసారి వీడియో సందేశాలు, విరాళాలు కాకుండా.. తమ్ముడు కోసం డైరెక్ట్ ఫీల్డ్ లోకి దిగబోతున్నారట. మే 5న చిరంజీవి పిఠాపురం వచ్చి పవన్ కోసం కాంపెయిన్ చేయబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడంతో మెగా అభిమానుల్లో, జనసైనికుల్లో ఎంతో ఆసక్తి, సంతోషం కనిపిస్తుంది. అలాగే చిరంజీవి నిజంగానే రాబోతున్నారా అనే ప్రశ్న కూడా ప్రజల్లో కలుగుతుంది. అయితే ఇప్పటి వరకు ఈ విషయం గురించి ఎటువంటి అధికారిక అప్డేట్ లేదు. ఇక ఈ విషయం పై నాగబాబు చెప్పిన మాటలు ఏంటంటే..”చిరంజీవి విషయం ఇంకా క్లారిటీ లేదు. సాయి దుర్గ తేజ్, వైష్ణవ్ తేజ్, అలాగే నా భార్య కూడా పిఠాపురం కాంపెయిన్ కి అయితే వస్తారు” అని చెప్పుకొచ్చారు.

ఇక చిరంజీవి కాంపెయిన్ గురించి సినిమా వర్గాల్లో వినిపిస్తున్న విషయం ఏంటంటే.. చిరు తన మూవీ షూటింగ్ నిమిత్తం వచ్చే వారం విదేశాలకు వెళ్ళబోతున్నారంటూ చెబుతున్నారు. ఒకవేళ చిరంజీవి నిజంగా సినిమా షూటింగ్ కోసం ఫారిన్ వెళ్లే వార్త నిజమైతే.. జనసేన ప్రచార వార్తలో నిజం లేనట్లే. కాగా పిఠాపురంలో ప్రచారం చేయబోతున్న వార్తలో.. చిరంజీవితో పాటు రామ్ చరణ్ పేరు కూడా వినిపించింది. మరి రామ్ చరణ్ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు. వరుణ్ తేజ్ అయితే నేడు పిఠాపురం ప్రచారంలో పాల్గొన్నారు.

Also read : Venkatesh : ఏపీ ఎన్నికల ప్రచారం కోసం వెంకీ మామ.. ఏ పార్టీ కోసం తెలుసా..?

  Last Updated: 27 Apr 2024, 05:08 PM IST