Site icon HashtagU Telugu

Chiranjeevi: నా కోడలు.. ఉపాస‌న‌పై మెగాస్టార్ చిరంజీవి ఆస‌క్తిక‌ర ట్వీట్‌!

Chiranjeevi

Chiranjeevi

Chiranjeevi: తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో-చైర్‌పర్సన్‌గా మెగా కోడలు ఉపాసన కొణిదెల నియమితులయ్యారు. క్రీడల పట్ల ఆమెకున్న ఆసక్తి, అభిరుచిని గుర్తించిన ప్రభుత్వం ఈ కీలక బాధ్యతను అప్పగించింది. ఈ నియామకంపై ఆమె మామ, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. “మా కోడలు ఇప్పుడు కో-చైర్‌పర్సన్” అంటూ ఎంతో గర్వంగా పోస్ట్ చేశారు.

చిరంజీవి ట్వీట్ హైలైట్స్

ఈ కొత్త పదవి ఒక గొప్ప గౌరవంతో పాటు పెద్ద బాధ్యత అని చిరంజీవి అభిప్రాయపడ్డారు. క్రీడల పట్ల ఉపాసనకు ఉన్న ఆసక్తి, నిబద్ధత కారణంగా ఆమె ఈ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. చిరంజీవి తన ట్వీట్‌లో ఉపాసనకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఇలా అన్నారు. ప్రియమైన ఉపాసన, నీ నిబద్ధత, అభిరుచితో మన రాష్ట్రంలోని గొప్ప క్రీడా ప్రతిభను వెలికితీయడంలో, వారిని ప్రోత్సహించడంలో ఎంతగానో తోడ్పడతావని నేను నమ్ముతున్నాను. క్రీడాకారులను ఉన్నత స్థాయికి చేర్చే విధానాల రూపకల్పనలో నీ పాత్ర కీలకం అవుతుంది. దేవుని ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు.

Also Read: Virat Kohli Reaction: టీమిండియాపై విరాట్ కోహ్లీ ప్ర‌శంస‌ల వ‌ర్షం.. ట్వీట్ వైర‌ల్‌!

ఈ నియామకంపై మెగా అభిమానులు, నెటిజన్లు కూడా ఉపాసనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ కొత్త బాధ్యతతో ఉపాసన తెలంగాణ క్రీడా రంగానికి ఎలాంటి సేవలు అందిస్తారో చూడాలి.